తెలుగు సినిమా రంగంలో జయప్రద ఎంత గొప్ప నటో తెలిసిందే. ఆమె ఎవరో కాదు మన అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ముందుగా తెలుగు సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జయప్రద.. ఇక్కడ అగ్ర హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1970 – 80 దశకంలో జయప్రద తన అందచందాలతో తెలుగు గడ్డను ఓ ఊపు ఊపేసింది.
ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దూసుకుపోయింది. 1970వ దశకం నుంచి ఆమె సినీ ప్రస్థానం 2005 వరకు 30 యేళ్ల పాటు ఆరు భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీలో విజయవంతంగా కొనసాగింది.
అయితే ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్‌లో చాలా డిస్టర్బ్ అయ్యింది. వ్యక్తిగత జీవితంతో పాటు ఆర్థికంగాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె సంపాదనతో ఇన్‌కం ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు ఆమెను టార్గెట్ చేయడంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అయితే అప్పట్లో ఓ బాలీవుడ్ నిర్మాత ఆమెను కాపాడతాను అంటూ మాయ మాటలతో మభ్యపెట్టాడు.
అలా ఆమెను తెలివిగా తన వలలో వేసుకున్నాడు. అయితే ఆ నిర్మాత చెప్పిన మాయలో పడి జయప్రద అతడి వలలో పడిపోయింది. ఆ నిర్మాత మరెవ్వరో కాదు శ్రీకాంత్ నహతా. ఒకానొక దశలో అతడు చూపించన ప్రేమతో నిజంగా ప్రేమలో పడిపోయి తాను ఎంత మోసపోయానన్న విషయం కూడా తెలుసుకోలేకపోయింది. శ్రీకాంత్‌కు అప్పటికే పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ విషయం కూడా జయప్రదకు ముందు తెలియలేదు. ఆ తర్వాత ఆమెకు నిజం తెలిసి.. తాను ఎంత మోసపోయానో తెలుసుకుని అతడికి దూరమైంది. శ్రీకాంత్ చేసిన మోసంతో ఆ తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకోలేదు. తన అక్క కొడుకును దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి యూపీలో రెండుసార్లు రాంపూర్ నుంచి లోక్‌సభకు ఎంపికైంది.