టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రతిభకు మరో మారుపేరు. ఎటువంటి హెల్ప్ లేకుండా తన సొంత కాళ్లతో కష్టపడి పైకి వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదిగిన మెగా స్టార్ 150కు పైగా సినిమాలతో జనాలను అలరించారు. చిరంజీవి తన కెరీర్లు ఎన్నో ఫ్లాప్ సినిమాలు చూశాడు హిట్ సినిమాలు చూశాడు.. ఏ సినిమా ఫ్లాప్ అయినా ఏ సినిమా హిట్ అయిన ..దానికి ఆ సినిమాలో ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
కాగా తన ప్రొఫెషనల్ లైఫ్ ని.. పర్సనల్ లైఫ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చూసుకుంటూ వచ్చిన చిరంజీవి లైఫ్ లో చాలా చేదు సంఘటనలు ఉన్నాయి. తన జీవితంలో పడిన కష్టాలు కన్నా హ్యాపీ మూమెంట్స్ ని గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడతాడట మెగాస్టార్. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు చిరంజీవికి ఇప్పటికీ చిలిపి అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి చిరంజీవికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టమట. జనరల్ గా స్టార్ స్టేటస్ కలిగిన వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ ని లైక్ చేయరు .
ఒకప్పుడు తిన్నా కానీ స్టార్ స్టేటస్ కి వచ్చేసాక కాస్ట్లీ ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ చిరంజీవి అలా కాదు తనకి ఇష్టమైన ఫుడ్ ని.. ఎప్పటికీ వదలడట ఇప్పటికి కూడా చిరంజీవి పటిక బెల్లం కిచెన్లో దాచుకొని మరి తింటాడట. అంతేకాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతారని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .అంతేగా ఇది కాకుండా చిరంజీవికి ఇంకా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టమట.అమ్మ వండిన చేపల కూర ఇష్టంగా తింటాడట. వాళ్ళ అమ్మ వండిన ఏ కూర అయినా సరే చాలా ఇష్టంగా చిరంజీవి తింటాడట. ఇంత వయసు వచ్చినా కానీ చిరంజీవి ఇంకా అమ్మ చేతితోనే అన్నం తింటాడట.