కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. తారలకే తార.. ఓ అందాల తార.. ఈ నయనతార అదే అంటారు ఆమె అభిమానులు. కెరియర్ మొదట్లో నయనతార చేసిన తప్పులు ఎలా ఉన్నా.. వాటిని సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాట్ హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది . బాలీవుడ్ ముద్దుగుమ్మల కన్నా నయనతార పారితోషకం ఎక్కువ తీసుకుంటుంది అంటే నయన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
కాగా నయనతార రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట.. సెకండ్ హనీమూన్ లో బిజీగా ఉంది . దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాలను వేడెక్కిస్తుంది నయనతార. కాగా రీసెంట్ గా ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార పిల్లలను కనదల్చుకోవట్లేదట. నయనతార పిల్లల్ని కనే ప్రసక్తే లేదట. దానికి కారణం ఆమె హెల్త్ కండిషన్.
నయనతారకు మొదటి నుంచి గర్భసంచి వీక్ గా ఉందట. దీంతో ఆమె గర్భం దాల్చడానికి చాలా కష్టం అంటున్నారట డాక్టర్స్ . ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ విషయం విగ్నేశ్ శివన్ కి కూడా తెలుసు . అయితే విగ్నేష్ శివన్ అన్ని తెలిసి పెళ్లికి ఒప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఓ బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడి పెళ్లి చేసుకున్నారట.
అయితే నయనతారకు ఆప్షన్ ఉంది, సరోగసి ద్వారా పిల్లల్ని కనవచ్చు.. కానీ విగ్నేష్ శివన్ దానికి అంగీకరించలేదట . కచ్చితంగా ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకొని మనం తల్లిదండ్రులుగా మారాలి అని చెప్పి పెళ్లికి ముందే ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చారట. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నీ ఉన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ..? అమ్మ అనే పిలుపు దగ్గర అవుతుందే ..కానీ ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయలేదు. ఆ విషయంలో నాయనతార దురదృష్టవంతురాలు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్..!!