ఒడిసా అమ్మాయి హైదరాబాద్ వచ్చి యాంకర్ అవ్వాలనుకుందా అంటే కాదు. ముందు తను సినిమాలలో నటించాలని అక్కడ హీరోయిన్‌గా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా సెటిలవ్వాలని అన్నో ఆశలు పెట్టుకొని వచ్చింది. అయితే, అనుకున్నట్టుగా హీరోయిన్ అవకాశాలు రాలేదు. చాలామందిలో అవమానాలు తప్పలేదు. ఒక ఆడపిల్ల సినిమా అవకాశాల కోసం అడిగితే ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో అవన్నీ ఎదుర్కుంది.
అప్పుడే ఇంకా కసి రెట్టింపైంది. ఎలాగైనా ఇక్కడే నిలబడి సాధించాలనుకుంది. ఆ పట్టుదలతోనే హీరోయిన్ కంటే బుల్లితెరమీద ఏ అవకాశం వచ్చినా చేయడానికి రెడీ అయింది. వచ్చిన ప్రతీ చిన్న అవకాశం వదులుకోలేదు. స్టార్ యాంకర్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. భాష రాదని ఎంతో మంది కామెంట్స్ చేశారు. ఫిజిక్ మీద కామెంట్స్ చేశారు. ఇంకా చాలా రకాల అవమానాలు అనుభవాలు. అవన్నీ పట్టుదలను పెంచాయే తప్ప వెనక్కి నెట్టలేదు.
ఆమె రష్మీ గౌతం. బుల్లితెర మీద పాపులర్ అయ్యేసరికి గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది. కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు పోషించినా గుంటూరు టాకిస్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. దాంతో వరుసగా పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తాయనుకుంది. కానీ, స్మాల్ స్క్రీన్ మీద నటిస్తే సిల్వర్ స్క్రీన్ మీద తీసుకోవడానికి మేకర్స్ అంతగా ఆసక్తి చూపించరు. అదే రష్మీ విషయంలో జరిగింది. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్‌గా చేసింది.
బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చిపెట్టలేదు. దానికంటే గ్యాప్ లేకుండా చేసే టీవీ షోస్ పేరుకు పేరు డబ్బుకి డబ్బు తెచ్చిపెడతాయని రష్మీ గట్టిగా నమ్మింది. అంతే..సినిమాలని తిప్పుకుంటారు..అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటారు. అలాంటి సినిమాల వల్ల స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ రాదు. దాని బదులు ఆ సమయం బుల్లితెరకి కేటాయిస్తే లాంగ్ లైఫ్ క్రేజ్‌తో కొనసాగుతుందని నమ్మింది. అందుకే, రష్మీ సినిమాలకంటే టీవీ షోస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సక్సెస్‌ఫుల్‌గా కోనసాగుతోంది.