మన జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు ఉంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా మనుషులే కదా వారికి కూడా ఎంత డబ్బు ఉన్నా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే సెలబ్రిటీలకు కూడా తగ్గించుకోలేని ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా హీరోలు విపరీతమైన ఒత్తిడితో ఉంటారు. వాళ్ళు శారీరకంగా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రాత్రి అనక పగలనకా.. ఎండనక వానకా.. రాయనక రప్పనక ఎక్కడైనా షూటింగ్ చేయాలి. ఈ క్రమంలోనే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎన్నోసార్లు గాయాలకు గురవాల్సి ఉంటుంది.
ఇక హీరోయిన్ల సమస్యలు కూడా చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. పైకి మాత్రమే వాళ్ళు గ్లామర్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే సినిమా షూటింగ్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాగే ఎంత సినీ సెలబ్రిటీలు అయినా వారు కూడా తగ్గని వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎంతో అందంగా కనపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్లు ఎన్నో కెమికల్స్ తో కూడిన బ్యూటీ ఐటెమ్స్ వాడుతూ ఉంటారు.
చాలామంది హీరోలకు నడుము నొప్పి ఉంటుంది. మరికొందరికి హీరోలు యాక్షన్.. డ్యాన్సుల్లో గాయాలకు గురవడంతో భుజం నొప్పి, నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి కామన్. ఈ క్రమంలోనే ఒక పాపులర్ టాప్ హీరోయిన్ కు కూడా గత కొన్నేళ్లుగా ఒక తీవ్రమైన సమస్యతో బాధపడుతోంది. అది స్కిన్ డిసీజ్. గతంలో ఆమె ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆమెకు స్కిన్ డిసీజ్ వచ్చింది. అయితే ఈ వ్యాధి ఎంతకు తగ్గలేదు. ఆమె ఎన్నో మందులు వాడింది. ఫారిన్లో సైతం ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా అప్పుడప్పుడు ఈ స్కిన్ డిసీజ్ తిరగబెడుతూనే ఉందట.
తాజాగా ఇప్పుడు ఆ స్కిన్ డిసీజ్ మళ్లీ తీవ్రంగా తిరగబెడుతోందట. దీంతో ఇప్పుడు ఇందులో స్పెషల్ అయిన డాక్టర్లతో ఆమె ట్రీట్‌మెంట్ చేయించుకుంటోందని తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీంతో ఆమె చేతిలో ఉన్న సినిమాలు ఇప్పుడు బాగా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందట. ఇప్పటికే ఆమె పది రోజుల పాటు బయటకు వచ్చే పరిస్థితి లేదు.
దీంతో ఆమె చేస్తోన్న సినిమాల షెడ్యూల్స్ ఏకంగా పది రోజుల పాటు వెనక్కు జరిపేశారు. అప్పటకీ తగ్గకపోతే ఆమె సినిమాలు నెల రోజులకు పైగా వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయి. మన హీరోయిన్లు స్నానానికే బిజ్లరీ వాటర్ అడుగుతూ ఉంటారు. అంత జాగ్రత్తలు తీసుకునే వాళ్లకే స్కిన్ డిసీజులు రావడం ఏంటో ? అని కొందరు ఆశ్చర్య పోతున్నారు.