Moviesఅభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ జశ్వంత్.. అరె ఏంట్రా ఇది..!?

అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ జశ్వంత్.. అరె ఏంట్రా ఇది..!?

షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . సినీ స్టార్స్ కు ధీటుగా తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్న నెంబర్ వన్ యూట్యూబర్. ఎస్ ఇదే అంటారు ఆయన అభిమానులు. షణ్ముఖ్ జశ్వంత్ పేరు చెబితే ఊగిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు .సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఫేమసో.. యూట్యూబ్లో షణ్ముఖ్ జస్వంత్ అంటే అంతే ఫేమస్ . చూడటానికి చాలా చిన్నోడే కానీ లోపల మ్యాటర్ మాత్రం ఫుల్ రేంజ్ లో ఉంటది అని అంటారు. ఆయన అభిమానులు. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే తనదైన స్టైల్ లో పండించడంలో షన్ను తర్వాత ఎవరైనా


పలు వెబ్ సిరీస్ యూట్యూబ్ షాట్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. గత సీజన్ బిగ్ బాస్ లోకి వెళ్లి ఉన్న పరువు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే . అంతే కాదు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దీప్తి సునయనను కూడా వదులుకునే పరిస్థితులు తెచ్చుకున్నాడు బిగ్ బాస్ లో ప్రవర్తించిన తీరుకి షణ్ముఖ్. ఆ మ్యాటర్ అంతా పక్కనపెడితే ప్రజెంట్ షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . దానికి కారణం ఆయన షేర్ చేసుకున్న ఒక ఫోటో. ఆ ఫోటోలో షణ్ముఖ్ హాస్పిటల్ బెడ్ పై దీని స్థితిలో పడి ఉండడమే దీనికి కారణం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షణ్ముఖ్ జశ్వంత్ ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .దీనికి తగ్గట్టే ఆయన పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అభిమానులను మరింత కంగారు పెడుతుంది. కొద్దిసేపటి క్రితమే షణ్ముఖ్ జస్వంత్ “నేను బాగున్నాను ఐ యాం ఫైన్” అంటూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . హమ్మయ్య నువ్వు సేఫ్ కదా అంటూ కామెంట్స్ పెడుతుంటే.. మరి కొందరు అదే ఏంట్రా నీ బర్త డేఅ ముందు ఇలా జరిగింది ..దిష్టి తగిలినట్టుంది అంటూ ఆయన ను ఓ ఫ్రెండ్ లా పలకరిస్తున్నారు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news