సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం. ఇది ఇప్పటి తంతుకాదు.. గత కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా చెరగని సాంప్రదాయంలా సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న వైరస్ . ఇలాంటి వైరస్ దాటికి ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ బలైయ్యారు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం క్యాస్టింగ్ కౌచ్ కి భలైయాము అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవ్వరు సరైన విధంగా స్పందించట్లేదు. సినీ పెద్దలు అంటూ చెప్పుకునే ఏ హీరో కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ క్యాస్టింగ్ కౌచ్ అరికట్టడానికి ప్రయత్నాలు చేయట్లేదు.
కాగా రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో ఫేడ్ అవుట్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ తో మాట్లాడిన మాటలు ..ఇప్పటికి తలుచుకున్న ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయట. అలాంటి మాటలు మాట్లాడాలని చెప్పుకొచ్చింది హీరోయిన్. మనకు తెలిసిందే కాస్టింగ్ కౌచ్ కి పిలిచే వాళ్ళని డైరెక్ట్ గా ఏ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ,హీరోస్ కానీ.. పిలవరు.. రాత్రికి డిన్నర్ కి వచ్చి చెక్ తీసుకో అంటారు .సాధారణంగా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో.
అలాగే సినిమా అయిపోయిన తర్వాత ఈ హీరోయిన్ ని డైరెక్ట్ డిన్నర్ చేసి చెక్ తీసుకుంటూ రా అనగానే సంబరపడిపోయిందట. తీరా చూస్తే ఆ చెక్ ఇవ్వకపోగా వేరే సినిమాలో ఆఫర్ ఇస్తాను మరి నాకేంటి లాభం అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ తో అడిగారట. అంతేకాదు ఆ హీరోయిన్..” నాకు ఇలాంటి ఇష్టం లేదు అంటే.. సరే మరి మీ అమ్మని పంపు” అంటూ చెత్త మాటలు మాట్లాడినట్టు ఆ హీరోయిన్ చెప్తే బాధపడిపోయింది. ఇదే విషయం వాళ్ళ అమ్మ గారికి తెలిసి వాళ్ళ అమ్మ డైరెక్టుగా ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ..”నా మొగుడు దగ్గరికి నీ అమ్మని పంపు” అంటూ పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిందట. మండిపోయిన ఆ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ గా ఎదగనీకుండా తొక్కేశారు.. దీంతో కొంతకాలం హీరోయిన్ గా ట్రై చేసిన ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.