Moviesశ్రీదేవి బోనీకపూర్ కంటే ముందే ఆ పెళ్ళైన హీరోను వివాహం చేసుకుందా...?...

శ్రీదేవి బోనీకపూర్ కంటే ముందే ఆ పెళ్ళైన హీరోను వివాహం చేసుకుందా…? ఎందుకు విడిపోయారంటే…?

ఒక వ్యక్తిని నమ్మి ప్రేమలో పడటం ఆ తర్వాత మోసపోవడం కామన్ గా బ‌య‌ట మ‌రియు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే సాధారణ ప్రజలకే కాకుండా కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ప్రేమలో పడి విఫలమైన వారు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా హీరోయిన్ల చేతిలో మోసపోయిన హీరోలతో పాటుగా హీరోల చేతిలో మోసపోయిన అందాల తారలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో పెళ్లైన‌ హీరోల చేతిలో కూడా స్టార్ హీరోయిన్లు మోసపోయారు. స్టార్ హీరోయిన్ సావిత్రి శివాజీ గణేషణ్ ను గాఢంగా ప్రేమించిన సంగతి తెలిసిందే. అప్ప‌టికే పెళ్లైన శివాజీ గణేషణ్ ను సావిత్రి పెళ్లి చేసుకుంది.

ఆ త‌ర‌వాత రాజ‌కీయాల కోసం శివాజి గ‌ణేష‌న్ సావిత్రిని దూరం పెట్టారు. చివరికి సావిత్రి ప్రేమించిన వ్య‌క్తి చేతిలోనే మోసపోయి దిక్కుతోచని స్థితిలో మరణించింది. ఇదిలా ఉండగా అతిలోకసుందరి శ్రీదేవి సైతం ఓ హీరో చేతిలో మోసపోయిందన్న సంగతి చాలామందికి తెలియదు. అతిలోక సుంద‌రి శ్రీదేవి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో బాలనటిగా నటప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీదేవి ఆ త‌రువాత హీరోయ‌న్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయింది.

తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగడంతో ఫుల్ బిజీ అయింది. టాలీవుడ్ హీరోల‌కు డేట్స్ ఇవ్వ‌లేనంత బిజీగా మారిపోయింది. కాగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్రీదేవి హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది. అయితే అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. చాలాకాలం మిథున్ చక్రవర్తితో ప్రేమలో ఉన్న శ్రీదేవి అతడిని రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంద‌ని కూడా అంటారు.

అయితే మిథున్ చక్రవర్తి భార్య శ్రీదేవితో పెళ్లిని అంగీకరించలేదు. ఇటు శ్రీదేవి త‌ల్లి కూడా మిథున్ త‌న భార్య యోగితాబాలికి విడాకులు ఇవ్వ‌కుండా శ్రీదేవిని మిథున్ దగ్గ‌ర‌కు పంపేందుకు ఒప్పుకోలేదు. దాంతో మిథున్ చక్రవర్తి శ్రీదేవిని దూరం పెట్టాడు. అలాంటి సమయంలో నిర్మాత భోణీకపూర్ శ్రీదేవికి దగ్గరయ్యారు. ఆమెను ఓదార్చారు అలా ఒక‌రిపై మ‌రొక‌రికి ఇష్టం పెర‌గ‌డంతో చాలా కాలం పాటూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాతే బోనీ కపూర్ శ్రీదేవి వివాహం జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news