జనరల్ గా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకోవడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ మన తెలుగు దర్శక నిర్మాతలకు తెలుగమ్మాయిల అందాల కన్నా పక్క భాష సుందరి మణుల అందాలే కళ్లకు కనిపిస్తూ ఉంటాయి అంటూ జనాలు మండిపడుతూ ఉంటారు. నిజానికి మన తెలుగమ్మాయిల్లో బోలెడంత టాలెంట్ ఉంటుంది . పక్క భాష ఇండస్ట్రీ గుర్తించిన తెలుగమ్మాయిల్లోని టాలెంట్ ని సొంత తెలుగు దర్శక నిర్మాతలు గుర్తించలేకపోవడం సిగ్గుచేటు అంటూ పలువురు హీరోయిన్స్ పబ్లిక్ గానే మండిపడిన సందర్భాలు ఉన్నాయి.
అయితే అలా బోలెడంత టాలెంట్ ఉండి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి పాపులారిటీ దక్కించుకొని.. ఆ పాపులారిటీతో తెలుగులో అవకాశాలు అందుకున్న హీరోయిన్ తెలుగు అమ్మాయి అంజలి . ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. తమిల్ లో షాపింగ్ మాల్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఈ అమ్మడు ..ఆ తర్వాత తెలుగులో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే సినిమాతో ఒక్కసారిగా తనపై ఉన్న అంచనాలన్నీ మార్చేసుకుంది. ఆ తరువాత చాలా సినిమాలు చేసిన అంజలి గురించి పెద్దగా చెప్పుకోలేకపోయారు జనాలు. అయినా కానీ అంజలి తెలుగులో నటించడానికి ఇష్టపడుతుంది.
అయితే రీసెంట్గా తెలుగమ్మాయి అంజలి “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అంతకుముందు అల్లు అర్జున్ “సరైనోడు” సినిమాలో బ్లాక్ బస్టర్ అనే ఐటెం సాంగ్ చేసింది . ఇలా అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ దర్శక నిర్మాతలు తెలుగులో హీరోయిన్గా అవకాశాలు ఇవ్వకుండా ఐటమ్ గర్ల్ గా చూడడంపై అప్పట్లో జనాలు మండిపడ్డారు .
అంతేకాదు అంజలి అసలు అలా చేయకుండా ఉండాల్సిందని.. ఆమె అందం ఐటమ్ గర్ల్ కి సంబంధించింది కాదని.. ట్రెడిషనల్ బ్యూటీ అని ఫ్యాన్స్ కూడా చెప్పుకొచ్చారు. కానీ అంజలి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే మోజులో తనకొచ్చిన ఐటమ్ గర్ల్ ఆఫర్ ని కూడా వదులుకోకుండా చేసింది . దీనితో ఆమె కెరియర్ డౌన్ ఫాల్ కు ప్రధాన కారణమైంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు అంజలి ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పుతుందని.. ఎవరు ఊహించలేదు ..ఇలా ఎవరు ఊహించిన విధంగా అంజలి ఐటమ్ సాంగ్ చేసి తన పరువును తానే తీసుకుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.