సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో చెప్పలేకపోతున్నాం. మనం వింటున్న వార్తలన్నీ నిజమవ్వాలని లేదు అలా అని అబద్ధం అవ్వాలని లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి సినీ ఇండస్ట్రీలో. అది ఫిలిం ఇండస్ట్రీ అయినా బుల్లితెర అయినా ఏదైనా సరే ఎవరిని నమ్మలేకపోతున్నా ..ఆ లిస్టులోకే తాజాగా ఎంటర్ అయ్యారు యాంకర్ ఓంకార్ అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
తన యాంకరింగ్ స్టైల్ తో తన వాక్చాతుర్యంతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ ఓంకార్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే యాంకర్ గా ఓంకార్ ఎంత పాపులర్ అయ్యారో. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వన్ సెకండ్ అంటూ ఓ ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు . ఇండస్ట్రీలో యాంకర్ గా ఉన్న ఓంకార్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరిని సరదాగా నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు.
కాగా యాంకర్ ఓంకార్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడం ఆయన అభిమానులను షాకింగ్ కి గురిచేస్తుంది. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే ఓంకార్ చేయలేదు. కాగా సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలో నిజం లేదు అని తెలుస్తుంది.