Moviesసూప‌ర్ అప్‌డేట్‌... మ‌హేష్ - రాజ‌మౌళి సినిమా ముహూర్తం ఆ రోజే...!

సూప‌ర్ అప్‌డేట్‌… మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా ముహూర్తం ఆ రోజే…!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప‌రశురం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అయినా కొన్ని ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర్లో ఆగిపోయింది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న కెరీర్‌లో 28వ సినిమా చేస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే 20 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తారు. ఈ సినిమా కోసం ర‌చ‌యిత అయిన రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో ఓ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను రాసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇక ఈ సినిమా గురించి రాజ‌మౌళి కూడా చాలా సీరియ‌స్‌గా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ ఎంత పెద్ద హిట్ అయినా క‌థ విష‌యంలో కొన్ని విమ‌ర్శ‌లు రావ‌డంతో మ‌హేష్ సినిమా విష‌యంలో అవి తిరిగి రాకూడ‌ద‌నే కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు.

ఇక ఈ సినిమా ప్రారంభోత్స‌వం గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంటూనే.. అటు సినిమా లొకేష‌న్ల కోసం వేట మొద‌లు పెట్టేశాడంటున్నారు. ఆఫ్రికాలోనే చాలా వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకోనుంద‌ట‌. రిప‌బ్లిక్ డే దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంద‌ట‌. అంటే వ‌చ్చే యేడాది త్రివిక్ర‌మ్ సినిమా రిలీజ్ అయితే.. ఆ త‌ర్వాత 2024లోనే మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news