Moviesతూనీగ పాప భర్త ఆ విషయంలో తోపు.. అసలు మ్యాటర్ తెలిస్తే...

తూనీగ పాప భర్త ఆ విషయంలో తోపు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!?

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా జనాలను మెప్పించి ప్రజెంట్ పెద్దయ్యాక హీరోయిన్ గా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే చిన్నప్పుడు చాలా క్యూట్ క్యూట్ గా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ పిల్లలు పెద్దయ్యాక మాత్రం ఆ విధంగా మెప్పించలేకపోతున్నారు . అందరూ కాదు అనుకోండి అందరిలో కొందరు . అయితే అలా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండి మంచి ఆఫర్స్ అందుకోలేక వచ్చిన ఆఫర్స్ తో మెప్పించలేక కొందరు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది ఈ తూనీగా తూనీగా పాప.

ఎస్ సుహాని కలిత అంటే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా అనే పాట పాడిన ఆ చిన్నారి పాప అంటే టక్కున గుర్తుపట్టేస్తారు .అంత బాగా ఫేమస్ అయ్యింది ఈ పాప ఈ పాటతో. ఇప్పటికీ ఈ పాపను ఎక్కడైనా కనిపిస్తే తూనీగా తూనీగా పాపని అంటారు సుహానికలిత అని ఎవ్వరూ అనరు. బాల రామాయణం అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహానికలిత ఆ తర్వాత మనసంతా నువ్వే, ప్రేమంటే ఇదేరా ,గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది . ఆ తరువాత స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేసిన సుహాని చదువు పూర్తి చేసుకున్న తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది .దీంతో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సుహానికలిత మ్యారేజ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ అమ్మాయి ప్రేమించింది ఎవరినో తెలుసా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాని. ఇతని గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి తన దైన స్టైల్ లో సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకున్నాడు.

అంతేకాదు ఇతను పాటలు పాడడంలో కింగ్ తోపుమ్యూజిక్ నేర్చుకోకపోయినా సింగింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో బాత్రూం సింగర్ గా పేరు తెచ్చుకొని బాత్రూంకి సెటిల్ అయిపోయాడు. నిజానికి ఈయనలో మంచి టాలెంట్ ఉందట. ఎలాంటి వారినైనా ఇట్టే తన మాటలతో ఆకర్షితులను చేసుకుంటారు అనే వార్త కూడా బయటకు వచ్చింది. దీంతో సుహాని చాలా లక్కీ అని అర్థం చేసుకునే భర్త దొరికారని కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు పెళ్లిపై సినీ ప్రముఖులు కూడా బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news