గతేడాది చివర్లో కరోనా తర్వాత మన పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ చేయాలా ? వద్దా ? అన్న డైలామలో ఉన్న వేళ బాలయ్య డేర్ చేసి అఖండతో థియేటర్లలోకి దిగాడు. అఖండ థియేటర్లలో మోత మోగించేసింది. అఖండ ఏకంగా రు. 200 కోట్లు కొల్లగొట్టి బాలయ్య కెరీర్ లోని తిరిగిలేని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అసలు అఖండ ఇచ్చిన ఉత్సాహంతోనే పెద్ద హీరోలు సైతం ధైర్యంగా థియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేసుకున్నారు. అఖండ కేవలం బాలకృష్ణకు మాత్రమే కాదు.. కరోనా తర్వాత ఓవరాల్‌గా టాలీవుడ్ కే ఒక సెన్సేషనల్ కం బ్యాక్ సినిమాగా నిలిచింది.
బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో ఏ సినిమా కూడా 50 రోజులు ఆడే పరిస్థితి లేదు. అలాంటిది అఖండ ఏకంగా డైరెక్ట్ గా నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడడంతో పాటుచిలకలూరిపేటలో డైరెక్ట్ గా 4ఆటలతో ఏకంగా 175 రోజులపాటు ఆడింది. అఖండ సాధించిన విజయం టాలీవుడ్కుపెద్ద ఉత్సాహం ఇచ్చింది.
ఆ తర్వాత బుల్లితెర మీద కూడా అఖండ ఎన్నో విజయాలు సాధించింది. ఓటీటీలో కూడా దుమ్ము రేపే రీతిలో అదర గొట్టేసింది. ఇంకా అఖండ గర్జన కొనసాగుతూనే ఉంది. తాజాగా సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) లో అఖండ గర్జించింది. విమర్శకుల నుంచి బాలయ్యకు బెస్ట్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
అలాగే బెస్ట్ ఫీమేల్ సింగర్‌గా జై బాలయ్య సాంగ్‌కు గీతా మాధురికి అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్‌తో అదరగొట్టేసిన సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌కు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది. దీంతో బాలయ్య భారీ కం బ్యాక్ ఇక్కడ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. సైమాలో మరోసారి అఖండ గర్జించడంతో బాలయ్య, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ హోరెత్తించేస్తున్నారు.