ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన `సూపర్` సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది టాలీవుడ్ స్వీటీ అనుష్క. ఆ సినిమాకు ముందు వరకు అనుష్క యోగా టీచర్. నాగచైతన్యకు యోగా టీచర్ గా ఉన్న అనుష్కను పూరి జగన్నాథ్ ఒక్కసారిగా హీరోయిన్గా చేసేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా అనుష్క వెలుగుతూనే ఉంది. ఇప్పటికే అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఇండస్ట్రీలోనే ఆమె ముదురు ముద్దుగమ్మగా ఉంది.
ఈ వయసులో కూడా కుర్ర హీరో నవీన్ పోలిశెట్టితో హీరోయిన్గా ఓ సినిమాలో నటిస్తోంది. తనకంటే చిన్నవాడు అయినా నవీన్ పోలిశెట్టి పక్కన అనుష్క నటిస్తుండటం ఇండస్ట్రీలోనే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 40 ఏళ్ల అనుష్కకు ఇప్పటికే సోషల్ మీడియా వాళ్ళు ఏకంగా 40 పెళ్లిళ్లు చేసేశారు. ప్రభాస్.. అనుష్క పెళ్లి అయితే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎన్నిసార్లు జరిగిందో లెక్కే లేదు.
మూడేళ్ల క్రితం వచ్చిన `నిశ్శబ్దం` సినిమా తర్వాత అనుష్క మళ్ళీ ఇప్పటికి వెండి తెర మీద కనపడలేదు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. అనుష్క – ప్రభాస్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్లో `బిల్లా`, `మిర్చి`, `బాహుబలి` సిరీస్ సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. వెండితెర మీద ప్రభాస్ .. అనుష్క జోడి నటిస్తుంది అంటే వీళ్ళను చూసేందుకే ఆ సినిమాకి వెళ్లే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.
గత కొంతకాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తాము ఇద్దరం మంచి స్నేహితులు అని ఇద్దరూ ఖండించినా ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడలేదు. అనుష్క అంటే ప్రభాస్ ఫ్యామిలీకి కూడా ఎంతో ఇష్టం. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా అనుష్క ఆయన చూసేందుకు వెళ్లింది. ఇక కృష్ణంరాజు మృతి చెందాక కూడా అనుష్క ప్రభాస్ ఇంటికి వెళ్లి పరామర్శించింది. ఏదో తెలియని బాండింగ్ అయితే వీరిద్దరి మధ్య ఉందన్నది నిజం.
ప్రభాస్ మీద తాను ఎంత ప్రేమ చూపిస్తున్న.. ఇప్పటికే తన వయసు 40 దాటేయడంతో ఇక అనుష్క విసిగి వేసారి పోయినట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడని తాను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఉపయోగం ఉండదన్న నిర్ణయానికి వచ్చేసిన అనుష్క.. మరో వ్యక్తితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. మంగుళూరుకి చెందిన అనుష్క తెలంగాణకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడబోతుందన్న గుసగుసలు అయితే నెల రోజులుగా గట్టిగా వినిపిస్తున్నాయి.
అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కు అనుకోని షాకే అని చెప్పాలి. ఏదేమైనా సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్న వీరిద్దరూ నిజజీవితంలోనూ నాగచైతన్య – సమంతలా కపుల్స్ కావాలని ఎంతోమంది ఆశించారు. మరి అనుష్క ఈ సంచలన నిర్ణయం తీసుకుంటే చాలామందికి పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది.