వయసు పెరిగినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్ లకు సైతం పోటీ ఇస్తున్నారు. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒకరు. సురేఖ వాణి ఎక్కువగా సీనియర్ కమెడియన్ బ్రహ్మీ కి భార్యగా నటించి ఆకట్టుకున్నారు. అంతే కాకుండా మోడ్రన్ మదర్ గా మరియు అక్క వదిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక సురేఖ వాణి భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. వీరికి సుప్రీత అనే కూతురు ఉంది. సుప్రీత కూడా ప్రస్తుతం మోడలింగ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో సుప్రీత, సురేఖవాణి కలిసి చేసే హంగామాకు అంతే ఉండదు. హీరోయిన్లకు పోటీగా చిట్టి పొట్టి దుస్తులు, హాట్‌గా కనిపిస్తూ రెచ్చిపోతుంటారు. ఇప్పటికే సుప్రీత బుల్లితెర సెలబ్రిటీ అయిపోయింది. విచిత్రం ఏంటంటే సుప్రీత అందం చూస్తుంటే స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు అన్నట్టుగా ఉంటుంది. తల్లి, కూతురు ఇద్దరు కలిసి పబ్బులకి వెళ్ళడంతో పాటు అక్కడ మందు గ్లాసులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో సైతం షేర్ చేస్తారు.
ఇక ఆ ఫోటోలకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే సుప్రీత వాళ్లకు కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇద్దరూ గ్లామర్ షో విషయం లో కూడా తగ్గేదెలా అంటారు. ఇదిలా ఉంటే సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అంతే కాకుండా బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఉందా అంటూ ప్రశ్నించగా ఇప్పుడైతే తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది.
ఒకవేళ చేసుకుంటే భాగా డబ్బులు ఉన్నవాడు భర్తగా రావాలి అంటూ సిగ్గుపడింది. అలాగే తనను బాగా చూసుకునే వాడు అయ్యి ఉండాలని చెప్పింది. సురేఖ కుమార్తె సుప్రీత మాత్రం తన తల్లికి మళ్లీ పెళ్లి చేద్దాం అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఖాళీగా ఉందిగా.. చేసేద్దాం అని చెప్పడం విశేషం. ఇక సురేఖను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోకు వంద ముద్దులు ఇస్తారు అని ప్రశ్నించగా…పవన్ కళ్యాణ్ కు అయితే వంద ముద్దులు ఇస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్‌పై సురేఖ వాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.