అనూ ఇమ్మానియేల్ అంత ఆశపడితే గురూజీ నట్టేట ముంచారే..? అవును ఇది నిజంగా త్రివిక్రమ్‌ని ఉద్దేశించే అనుకుంటారు. ఆయన పెద్ద దర్శకుడు గనక ఆయన రూపొందించిన సినిమాలో హీరోయిన్‌గా నటిస్తే సెటిలవ్వొచ్చనే ధీమాతో హీరోయిన్లు ఉంటారు. త్రివిక్రమ్ వరుస ఛాన్సులు ఇచ్చి ఎంతమందిని స్టార్ హీరోయిన్లను చేయలేదు. కానీ, అది అందరికీ వర్కౌట్ అవడం లేదు. కేవలం మేయిన్ హీరోయిన్ కి తప్ప సెకండ్ లీడ్ చేసిన వాళ్ళకి మాత్రం ఏమీ ఒరగడం లేదు.
ఆ లెక్కన చూసుకుంటే త్రివిక్రమ్ సినిమాలలో మేయిన్ హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్ లాంటి వారూ ఆయనను నమ్మి ఘోరంగా మోసపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక హీరోయిన్‌కి గనక ఫ్లాపొస్తే మళ్ళీ తర్వాత సినిమాలో అవకాశం రావడానికి దేవుడు దిగి రావాల్సిందే అనేట్టుగా ఉంది. అదే పెద్ద హీరో, పెద్ద దర్శకుడు పెద్ద నిర్మాణ సంస్థ గనక అయితే సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ వారే తీసుకుంటారు.
ఒకవేళ ఏ కారణం చేత అయినా సినిమా ఫ్లాపయితే, ముందు వేలెత్తి చూపించేది అందులో నటించిన హీరోయిన్స్‌నే. రచయితగా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకుడిగా కూడా అలాంటి హిట్సే ఇస్తున్నారు. చాలా తక్కువ సినిమాలే యావరేజ్‌గా, ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. అలా డిజాస్టర్ అయిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా మొతలైనప్పుడు అత్తారింటికి దారేది సినిమాతో పోల్చి అంతకంటే భారీ హిట్ అవుతుందని చెప్పుకున్నారు.
తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. అసలే హిట్స్ లేక ఆవురావురంటున్న అనూ ఇమ్మానియేల్‌కి అజ్ఞాత వాసి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రాగానే ఉబ్బి తబ్బిబ్బై తన స్టార్ డం ఏ సమంతనో, పూజా హెగ్డే రేంజ్‌లోనో ఊహించుకుంది. కానీ, గురూజీ రొటీన్ ఫార్ములాతో పవన్ తో పాటు ఆయన అభిమానులకు షాకిచ్చాడు. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ హిట్ దక్కించుకొని వెలిగిపోవాలనుకున్న అనూ ఇమ్మానియేల్ అడ్రస్ లేకుండా పోయింది.
ఆ తర్వాత ఆమె అడ్రస్ లేకుండా పోయింది. తెలుగులో ఒకటి రెండు సినిమాలతో పాటు అటు తమిళంలో నటించినా ఆమెకు మీడియం రేంజ్ హీరోల పక్కన కూడా స్టార్‌డమ్ రాలేదు. అలా అను పేరుకే హీరోయిన్‌గా ఉన్నా త్వరగానే ఫేడవుట్ అయిపోయింది.