టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన అందగత్తెల్లో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.. రోజా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాకుండా అప్పటి స్టార్స్ అందరి తోనూ కలిసి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు మంచి హిట్లే పడ్డాయి. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అదరగొట్టింది. రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. అంతే కాకుండా తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీ లోనే చదువుకున్నారు. అంతే కాకుండా నాగార్జున యునివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ లో పీజీ చదువుకుంది.
నటన పై ఉన్న ఆసక్తి తోనే రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ రోజాకు సినిమాల్లో గురువు. ఆమె పేరును రోజాగా మార్చింది కూడా ఆయనే. అంతే కాకుండా రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వామణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లి తరవాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. తన ప్రొడక్షన్ లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలను తీయడానికి రోజా తాను ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట.
అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా అవి సూపర్ హిట్ అవ్వలేదు. దాంతో ఆ సినిమాలకు నష్టాలను చుడాల్సి వచ్చింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రోజా 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా చాలా నష్టపోయారు. కాగా 2013 లో జబర్థస్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా ఎంట్రీ ఇచ్చారు.
జబర్దస్త్ కామెడీ షో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో రోజా కూడా ఈ షోకు అత్యధికంగా రెమ్యునరేషన్ పుచ్చుకున్నారు. ఆర్థికంగా ఎదగడానికి కూడా రోజాకు జబర్దస్త్ సహరించింది. ఇక 2014 లో నగరి నుండి పోటీ చేసిన రోజా ఎమ్మెల్యే గా గెలిచారు. అంతే కాకుండా రెండో సారి కూడా గెలిచి ప్రస్తుతం మంత్రి పదవి లో ఉన్నారు. ఏదేమైనా రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో జబర్దస్తే కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.