Moviesఎన్టీఆర్‌పై మ‌న‌సు ప‌డ్డ కుర్ర హీరోయిన్‌... అబ్బా ఏం స్కెచ్ వేసిందిలే...!

ఎన్టీఆర్‌పై మ‌న‌సు ప‌డ్డ కుర్ర హీరోయిన్‌… అబ్బా ఏం స్కెచ్ వేసిందిలే…!

టాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్లు కొట్టిన హీరోయిన్లు కచ్చితంగా స్టార్ హీరోలు అంటే తమకు ఇష్టం అంటూ చెబుతుంటారు. ఇందుకు కారణం స్టార్ హీరోలు కంట్లో పడితే వాళ్ల పక్కన ఒకటి రెండు సినిమాలు చేస్తే ఇక తమకు తిరిగి ఉండదన్న ప్లాన్‌తోనే ఆ హీరోయిన్లు తమకు ఆ హీరో అంటే ఇష్టం… ఈ హీరో అంటే ఇష్టం అని అంటుంటారు. తాజాగా సీతారామం సినిమాలో సీత పాత్రకు ప్రాణం పోసి ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టి అంతా తన వైపునకు తిప్పుకుంది హీరోయిన్ మృణాల్‌ ఠాగూర్.

సీతారామం సినిమా హిట్ అవ్వటంలో మృణాల్ పాత్ర చాలా కీలకంగా నిలిచింది. ముఖ్యంగా లవ్, ఎమోషనల్ సీన్లలో ఆమె నటన చూసిన జనాలు మైమరిచిపోయారు. పెళ్లి సందD సినిమాలో శ్రీలీల‌ ఒక ఊపు ఎలా ? ఊపేసిందో ఇప్పుడు మృణాల్‌ కూడా అలాగే పిచ్చెక్కించేస్తోంది. సీతారామం ప్రమోషన్లలో బిజీగా ఉన్న మృణాల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేసాయి. ఈ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలు ప్రభాస్ – మహేష్ – ఎన్టీఆర్ లలో మీకు ఎవరితో ? నటించాల‌ని ఉందన్న ప్రశ్నకు ఆమె ఆలోచించకుండా వెంటనే తనకు ఎన్టీఆర్‌తో చేయాలని ఉందని టక్కున చెప్పేసింది.

ఎన్టీఆర్ తో ఒక్క సినిమాలో అయినా నటించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం కోరుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు డ్యాన్సులను చాలామంది హీరోయిన్లు ఇష్టపడతారు. ఎన్టీఆర్ తెలుగులో ఫుల్ మాస్‌ హీరో. ఎన్టీఆర్‌తో ఒక్క సినిమా ప‌డితే చాలు.. ఎలాంటి హీరోయిన్ అయినా మాస్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళిపోవచ్చు. ఎన్టీఆర్ ప‌క్క‌న చేశాక ఆమె కెరీర్ ఎక్క‌డికో వెళ్లి పోతుంది. అందుకే మృణాల్‌ కూడా ఎన్టీఆర్ పక్కన చేయాలని ఉందని చెప్పిందన్న ప్ర‌చారం జరుగుతుంది.

ఇక ఎన్టీఆర్ ఇటీవల పాన్ ఇండియా హిట్ త్రిబుల్ ఆర్‌ సినిమాలో నటించగా… ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే 30వ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల అన్వేషణ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించే సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్ తో సినిమా కోసం రెడీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news