నందమూరి బాలకృష్ణ వివి. వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా ఆంధ్రదేశాన్ని ఊపేస్తుంది. అలాంటి సమయంలో ఆగమేఘాల మీద చెన్నకేశవరెడ్డి సినిమాను ఇంద్రకు పోటీగా రిలీజ్ చేశారు. అప్పటికే వినాయక్ ఎన్టీఆర్ తో ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించి ఉన్నారు. వినాయక్ రెండో సినిమా కావడం… టైటిల్ పవర్ ఫుల్ గా ఉండడంతో చెన్నకేశవరెడ్డిపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే స్క్రీన్ ప్లే లోపాలతో పాటు హడావుడిగా సినిమాను పూర్తి చేయడంతో చెన్నకేశవరెడ్డి అంచనాలకు కాస్త దూరంగా ఆగింది. సినిమా బాగుందన్న పేరు వచ్చినా పక్కన ఇంద్ర సినిమాతో కంపేరిజన్ చేయాల్సి రావడంతో చెన్నకేశవరెడ్డి హిట్ అనిపించుకున్న సూపర్ హిట్ అవ్వలేదు. ఆ టాక్‌తో కూడా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా టబు, శ్రీయ నటించారు. తండ్రి పాత్రలో నటించిన బాలయ్యకు జోడిగా ముందుగా సౌందర్యను సంప్రదించారట. అయితే కథ మొత్తం విన్న సౌందర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.
సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఐదారు సినిమాలకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ పరిచయంతోనే ఆయన బెంగళూరు వెళ్లి సౌందర్యకు కథ చెప్పగా తండ్రి పాత్రకు జోడీగా నటించాల్సి రావడంతో సౌందర్య ఒప్పుకోలేదట. ఇప్పుడే ఇలాంటి ఓల్డ్ ఏజ్ పాత్రల్లో నటిస్తే.. ఆ తర్వాత కూడా అదే తరహా పాత్రలు వస్తాయని.. హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ పాత్రలతో రిస్క్ ఎందుకుని చెప్పి రిజెక్ట్ చేసేసిందట.
ఆ తర్వాత వినాయక్ ఈ కథను టబుకు చెప్పగా ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. అలా తండ్రి పాత్రకు జోడీగా టబును తీసుకోగా… ఫామ్‌లో ఉన్న శ్రీయను కొడుకు పాత్రకు జోడీగా సెట్ చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. రిలీజ్ డేట్ ముందే ప్రకటించడంతో పాటు హడావిడిగా రిలీజ్ చేయడంతో ఓ పాటను రిలీజ్ తర్వాత షూట్ చేసి మళ్లీ యాడ్ చేశారు. బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.