ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రణీత సుభాష్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏ రకంగా గురూజీ అవకాశం ఇచ్చాడో గానీ, ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించేసింది. అత్తారింటికి దారేది సినిమాలో సమంతతో పాటు ప్రణీత బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రణీతతో ఉన్న సాంగ్ ఆడియోలో వింటే అది సమంతతో తీసిందే అనుకుంటారు.
గురూజీ అంత మంచి ఛాన్స్ ఇచ్చాడు. అయినా ప్రణీత పైకి ఎగబాకలేకపోయింది. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ భాషలలో ప్రణీత హీరోయిన్‌గా సినిమాలు చేసంది. విశేషం ఏమిటంటే తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన పోకిరి కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అక్కడ బాగానే పాపులర్ అయింది. తెలుగులో బావ, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్, రభస లాంటి సినిమాలలో నటించింది. అన్నిటికంటే కూడా ఎక్కువగా క్రేజ్ తెచ్చింది ఒక్క అత్తారింటికి దారేది సినిమానే.
అయితే, ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. బొడ్డు అందాలు చూపిస్తూ చారడేసి కళ్ళతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అది ఆ కొద్దిసేపే మిగిలింది తప్ప కమర్షియల్ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకోలేదు. దాంతో గత కొంతకాలంగా అవకాశాల కోసం ఆవురావురంటోంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఎటూ అకవాశాలు లేవు. దానికి తోడు పెళ్ళైన హీరోయిన్ అంటే మేకర్స్ కాస్త ఆలోచిస్తారు. అదే ప్రణీతకు జరిగింది.
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నా మనవాళ్లకి క్రేజ్ ఉన్న వారిని చూసేందుకే ఆసక్తి ఉండదు. ఎంత సేపటికి సినిమా సినిమాకు కొత్త సరుకు దిగాలి..అని చూస్తుంటారు. తల్లైన తర్వాత కూడా ప్రణీత తన అందాల ఫొటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఎన్ని గ్లామర్ పిక్స్ షేర్ చేసినా ప్రణీతను పట్టించుకునే వారు లేనప్పుడు లాభం ఏంటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీపై ఎవరైనా ఓ లుక్ వేస్తారేమో చూడాలి.