హీరోయిన్ అంజలి.. పేరుకు తెలుగమ్మాయి అయినా కోలీవుడ్ లో సినిమాలు చేసి అక్కడ పాపులర్ అయ్యి ..ఆ పాపులారిటీతో తెలుగులో అవకాశాలు అందుకుని ..ఇక్కడ కూడా ప్రజెంట్ హీరోయిన్ గా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది. షాపింగ్ మాల్ సినిమాలో అంజలి నటించిన తీరు జనాలను మెప్పించింది. నాచురల్ గా ..సాదాసీదాగా ఓ లో క్లాస్ అమ్మాయి పడే బాధలను.. ఓ లో క్లాస్ అమ్మాయి ప్రేమిస్తే వచ్చే కష్టాలు.. సినిమాలో తనదైన స్టైల్ లో నటించి అందరికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ మెప్పిస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించి.. అంజలి లో ఉన్న మరో కొత్త టాలెంట్ ని బయటపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విషయం అందుకున్నాయో మనకు తెలిసిందే. అయినా కానీ అంజలి పేరు జనాలకు గుర్తుంది. తెలుగమ్మాయి.. నాచురల్ గా నటిస్తుంది అన్న.. పేరుతో అంజలి ఇన్నాళ్లు తన సినీ కెరీర్లు నెట్టుకొచ్చింది. అయితే తాజాగా అంజలి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంజలి దాదాపు 17 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఖాళీగా ఏ రోజు లేదు హీరోయిన్ గా.. ఐటం గర్ల్ గా.. చేతికి వచ్చిన సినిమాలు చేస్తూనే ఉంది. కానీ మొత్తంగా అంజలి ఇన్నాళ్లు సంపాదించిన ఆస్తి విలువ పట్టుమంటే పది కోట్లు కూడా లేవట. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ..అంజలి ఒక్కొక్క సినిమాకి దాదాపు కోటి రూపాయలు తీసుకుంటుందట. అంతక ముందు వరకు ఓ సినిమాకి 70 లక్షలు 80 లక్షలు సినిమాలో తన పాత్ర అనుసారంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. తన కెరియర్ లోనే ఫస్ట్ టైం మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు కోటి 70 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇలాంటి రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అంజలి ఇన్నాళ్ల తన కెరీర్లో కేవలం దాచుకుంది 10 కోట్లేనా.. అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ అంజలి కి చెన్నైలో ఓ ఇల్లు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు హైదరాబాద్ లో కూడా కొన్ని భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. వాటి విలువ 10 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మిగతా డబ్బు అంజలి ఏం చేసింది? సినీ ఇండస్ట్రీలో కి వచ్చి ఇంతకాలమైనా తన ఆస్తులను ఎందుకు పెంచుకోలేకపోతుంది .అంజలి కి చెప్పుకొని సమస్యలు ఇంకా ఉన్నాయా..? లేకపోతే అంజలి తన ఆస్తులను దాచిపెడుతుందా..? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు అభిమానులు. అయితే గతంలో ఆమె తన ఆస్తులు విషయంలో తన కుటుంబ సభ్యులతో గొడవ పడిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యుల్ కారణంగా పోలీస్ కేసు కేసులు కూడా ఎదుర్కొంది అంజలి. కానీ ప్రజెంట్ అందరికీ దూరంగా తన లైఫ్ తన బ్రతుకుతున్నట్లు సమాచారం.