Moviesలైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఇది విజయ్ కెరీర్ లోనే పరమ చెత్త...

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఇది విజయ్ కెరీర్ లోనే పరమ చెత్త రికార్డ్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ పూరి కెరియర్ లోనే మరే సినిమాకి కూడా చేయలేదు. అంతేకాకుండా ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కింది. ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది లైగర్.

దీంతో ఈసారైనా పూరి హిట్ కొడతాడు అనుకున్నా అభిమానులకు నిరాశే మిగిలింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ కెరీర్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు కానీ అది అభిమానులు ఆకలి తీర్చే హిట్ అయితే కాదు/. కనీసం ఈ సినిమాతో నైనా పూరి తన పూర్వ వైభవం అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఈసారి కూడా అభిమానుల గుండెల్లో రాడ్ దించేసాడు. దీంతో సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా దారుణాతి దారుణంగా ఉన్నాయి.

కొద్దిసేపటికి క్రితమే లైగర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే పర్లేదు అనిపించిన మరోపక్క విజయ్ దేవరకొండ స్థాయి, స్టామినా చూస్తే ఈ కలెక్షన్స్ చాలా హర్ట్ చేసే విధంగా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో లేదని అందరూ చెప్పుకొచ్చారు . అంతేకాదు మార్నింగ్ షోకే సినిమాకి దారుణమైన టాక్ రావడంతో ..ఆ ఇంపాక్ట్ తర్వాతే షో పై పడింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా లైగర్ చెత్త రికార్డు నమోదు చేసింది . మరి ముఖ్యంగా హీంది లో విజయ్ రేంజ్ ను ఊహించుకుంటే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు .ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు లైగర్ సినిమా 13.35 కోట్ల షేర్ 24.5 కోట్ల క్రాస్ అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

తొలిరోజున ‘లైగర్’ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ (Liger Collections) వివ‌రాలేంటో చూద్దాం..

తెలంగాణా – 04.24cr

రాయలసీమ – 01.32cr

నెల్లూరు – 00.40cr
(ఫిక్సెడ్ హైర్స్ – 00.12cr )

గుంటూరు – 00.83cr
( ఫిక్సెడ్ హైర్స్ – 00.31cr )

కృష్ణా – 00.48cr

వెస్ట్ – 00.39cr

ఈస్ట్ – 00.64cr

ఉత్తరాంధ్ర – 01.27cr

( కోస్తాంధ్ర + ఉత్తరాంధ్ర – 04.01cr )

రెండు తెలుగు రాష్ట్రాల తొలి రోజు టోటల్ థియేటర్ షేర్ – 09.57cr

రెండు తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ షేర్ – 62.00cr

రెండు తెలుగు రాష్ట్రాల తొలి రోజు టోటల్ థియేటర్ గ్రాస్ – 15.40cr
( ఫిక్సెడ్ హైర్స్ – 00.43చ్ర్ )

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- 00.55cr

మిగతా భాషలు – 00.22cr

హిందీ బెల్ట్- 00.55cr

ఓవర్ సీస్ – 02.56cr

వరల్డ్ వైడ్ తొలి రోజు టోటల్ థియేటర్ – 13.45cr

వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ షేర్ – 90.00cr

వరల్డ్ వైడ్ తొలి రోజు టోటల్ థియేటర్ గ్రాస్ – 24.30cr
వరల్డ్ వైడ్ మొత్తం షేర్ – 13.4cr

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news