దివంగత అందాల తార దివ్యభారతి ఒకప్పుడు తన అందచందాలతో భారతదేశ మొత్తం ఊపేసింది. బాలీవుడ్‌లో 16 సంవత్సరాలకే హీరోయిన్ అయినా దివ్యభారతి ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా దివ్యభారతి అందచందాలకు ఫిదా అయిపోయారు. తెలుగులో కూడా తక్కువ సమయంలోనే వెంకటేష్ – బాలకృష్ణ – చిరంజీవి – మోహన్‌బాబు తమిళంలో ప్రశాంత్ సరసన నటించిన నటించింది. వెంకటేష్ కు జోడిగా ఆమె నటించిన బొబ్బిలి రాజా సూపర్ హిట్.
ఆ తర్వాత మెగాస్టార్‌కి జోడిగా ఆమె నటించిన రౌడీ అల్లుడు కూడా హిట్ అయింది. ఇక మోహన్ బాబుతో దివ్యభారతి చేసిన అసెంబ్లీ రౌడీ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో దివ్యభారతి – మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటికీ టీవీలలో చూస్తుంటే దివ్యభారతి నిజంగానే చనిపోయిందా ? లేదు ఆమె ఇప్పటికీ మన మధ్యనే ఉంది అనిపించేలా తన పాత్రలో జీవించేసింది. ఇక బాలయ్యకు జోడీగా ఆమె ధర్మక్షేత్రం సినిమాలో నటించింది.
దివ్యభారతి చనిపోయే టైంలో ఆమె తమిళ హీరో ప్రశాంత్ పక్కన తొలిముద్దు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే తాను హీరోగా నటించే మరో సినిమాలో దివ్యభారతిని హీరోయిన్‌గా తీసుకోవాలని వెంకటేష్ అప్పటికే రికమెండ్ చేయడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బొబ్బిలి రాజా సినిమా హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కొందరు దర్శకనిర్మాతలు మరోసారి వెంకటేష్ – దివ్యభారతి కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు
బొబ్బిలి రాజా సినిమా టైమ్ నుంచి దివ్యభారతితో వెంకటేష్ సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే దివ్యభారతి హఠాన్మరణం పాలయిందో వెంటనే వెంకటేష్ ముంబై వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించడంతో పాటు తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఆ వార్త తెలిసిన వెంటనే వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
ఏదేమైనా భారతదేశ సినీవిలాకాశంలో ఒక వెలుగు వెలగాల్సిన దివ్యభారతి చిన్న వయసులోనే మృతి చెంది ఎంతోమందిని బాధ పెట్టేసింది. నిజంగా దివ్యభారతి కొన్నాళ్లపాటు హీరోయిన్‌గా కొనసాగి ఉంటే ఆమె కచ్చితంగా ఇండియన్ సినిమాను శాసించే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది.