పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ అతి ముఖ్యమైన ఘట్టం. పుట్టుక చావు మధ్యలో పెళ్లి అనేది మూడో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి అంటే ఆ భార్యాభర్తలు నిండు నూరేళ్ల పాటు కలిసి ఉండే దాంపత్య జీవితంగా ఉండేది. ఏడు జన్మలకు ఒకే ఒక మంచి భర్త దొరకాలని ప్రతి ఒక్కరు కలలు కనేవారు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లి అనే పదానికి అర్థం మారిపోయింది. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి. కొద్దిరోజుల క్రితం వరకు సీనియర్ నటుడు నరేష్ పెళ్లిళ్ల జీవితం గురించి అనేక రకాల వార్తలు వచ్చాయి.
ఇప్పటికే నరేష్ కు మూడు పెళ్లిళ్లు జరగగా.. ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కూడా కొందరి జీవితాల్లో పెళ్లి కలిసి రాలేదు. కొందరికి రెండు లేదా మూడు పెళ్లిళ్లు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.
పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఎక్కువమంది ఆయన మూడు పెళ్లిళ్లపై మాట్లాడుతూ ఉంటారు. అయితే రాజకీయంగా పవన్ ను దెబ్బతీయటానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. పవన్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనతో బద్రి – జానీ సినిమాలలో నటించిన రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకోగా… తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.
విజయదుర్గ :
చిరంజీవి చెల్లెలు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయదుర్గకు కూడా పెళ్లి కలిసి రాలేదు. సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ పుట్టాక భర్తతో విడాకులు రావడంతో చాలా రోజులపాటు భర్తకు దూరంగానే ఉంది. దాదాపు 15 – 20 సంవత్సరాల పాటు ఆమె భర్తకు దూరంగానే ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక ఈ వయసులో తనకు తోడు కావాలనుకున్న విజయదుర్గ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకుంది.
శ్రీజ :
ఇక చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లిళ్ల విషయంలో కూడా తప్పటడుగులు తప్పలేదు. ఆమె ముందుగా తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరి పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టాక భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసిన శ్రీజ కళ్యాణ్‌దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏంటంటే కళ్యాణ్ దేవ్‌తో కూడా శ్రీజకు మరో ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌కు కూడా ఆమె విడాకులు ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి.
అల్లు బాబి :
ఇక అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేము. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట భార్యతో ఒక కూతురు పుట్టాక విడిపోయి ఇప్పుడు ముంబైకి చెందిన డిజైనర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మెగా కాంపౌండ్‌లో నలుగురికి ఒకటికి మించిన పెళ్లిళ్లు అయ్యాయి.