Moviesరానాతో త్రిష పెళ్లి..అలా ఆగిపోయిందా..?

రానాతో త్రిష పెళ్లి..అలా ఆగిపోయిందా..?

త్రిష ఇటు తెలుగులో అటు తమిళంలో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష..ఆ తర్వాత తెలుగులో వర్షం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తరుణ్ – ఎన్.టి.ఆర్ – బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి – పవన్ కళ్యాణ్ – నాగార్జున – వెంకటేశ్ – రానా – రవితేజ – ప్రభాస్ ఇలా దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలతోనూ జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా నంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది. త్రిష చెన్నై చిన్నది అయినా కూడా ఆమెను తెలుగు ఇండ‌స్ట్రీ, తెలుగు సినీ ల‌వ‌ర్స్ ప‌దేళ్ల‌కు పైగా నెత్తిన పెట్టేసుకున్నారు.

అలాగే, తమిళంలో కూడా త్రిష దాదాపు అందరు స్టార్స్‌తో నటించి హిట్స్ అందుకుంది. త్రిష త‌న కెరీర్‌లో కొంద‌రు హీరోల‌తో ఎఫైర్లు న‌డిపింద‌న్న పుకార్లు అయితే ఎదుర్కొంది. వీరందరికంటే కూడా టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటితో త్రిష చాలా చనువుగా ఉండేది. ఇద్దరు కలిసి పబ్‌లు పార్టీలకు రెగ్యులర్‌గా వెళ్ళేవారు. ఆ సమయంలో ఎక్కువగా మీడియా కంటపడి వార్తల్లో నిలిచేవారు.

కొన్ని ఇంగ్లీష్ మాగ్జైన్స్‌లోనూ రానా – త్రిష గురించే వార్తలు రాసేవారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని డేట్ అంటూ పలు ప్రాంతాలు చుట్టేస్తున్నారని చెప్పుకున్నారు. దాంతో ఇద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి కూడా జరిగిందని వార్తలు పుట్టాయి. అయితే, ఇదే విషయం ఇండస్ట్రీ వర్గాలలో మరోలా వినిపించేది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న మాట వాస్తవం అయినా కూడా అది ప్రేమా లేక స్నేహమా ? అనేది మాత్రం ఎవరికీ తెలియదని దాటేశారు. ఇక కొందరైతే రానా ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారని కూడా చెప్పుకున్నారు.

ఇదంతా చూసి త్వరలో నిజంగా వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారని ఫిక్సైపోయారు. కానీ అదే సమయంలో త్రిషదే అంటూ ఓ బాత్రూం వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఇది అభిమానులనే కాక చాలామంది ప్రేక్షకులను కాస్త ఆందోళనకి గురిచేసింది.ఇక కాస్త అటు ఇటుగా ఇదే సమయంలో చెన్నై వీధుల్లో – హైవేలపై స్నేహితురాళ్ళతో నైట్ పార్టీలు చేసుకొని రోడ్ల మీద నానా హంగామా చేసి పోలీసులకి చిక్కి జరిగిన రచ్చంతా తెలిసిందే. ఇలాంటి సంఘటనలు త్రిష విషయంలో చాలా సందర్భాలలో జరిగింది.

ఇవన్నీ కూడా కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. అందుకే, త్రిష – రానా పెళ్ళి జరగలేదని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. హైద‌రాబాద్‌లో ఓ ప‌బ్‌లో వీరు తూలిపోతూ వెళ్లిన వీడియోలు కూడా తెలుగు మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఏదేమైనా ఆ మూవ్‌మెంట్‌లో నిజంగానే రానా – త్రిష పెళ్ళి జరుగుతుందనే అనుకున్నారు. కానీ, జరగలేదు. కారణాలు కూడా ఇవే అని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రానా మిహిక బజాజ్ ని పెళ్లి చేసుకొని హాయిగా గడుపుతున్నారు. త్రిష పెళ్లి ఎప్పుడవుతుందో క్లారిటీ లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news