Moviesమాదర్**** అనడం తప్పులేనప్పుడు... లైగర్ ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకోవడంలో కూడా...

మాదర్**** అనడం తప్పులేనప్పుడు… లైగర్ ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకోవడంలో కూడా తప్పులేదే..!?

నిన్న భారీ అంచనాలను నడుము ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ మూవీ మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది . సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడం.. తీసిన సీన్స్ మళ్లీ కనిపించేలా ఉండడం ..ఆల్ మోస్ట్ అందరూ ఊహించుకునే విధంగానే పూరి జగన్నాథ్ సినిమా తెరకెక్కించడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే లైగర్ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, ఈ సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న టైం లోనే అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ” అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ.. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా”.. అంటూ ఓ ఘాటైన ట్విట్ చేసింది. ఈ ట్వీట్ లైగర్ ఫెయిల్యూర్ సినిమాకు సంబంధించి అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు విజయ్ ఫ్యాన్స్.

గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో విజయ్ దేవరకొండ అనసూయ మధ్య జరిగిన వార్ మర్చిపోలేనిది. ఓ అభ్యంతరకరం పదం వాడాడంటూ అనసూయ విజయ్ దేవరకొండపై ఘాటైన కామెంట్స్ చేసింది .అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమే రేపిన.. ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకున్నింది. కానీ లైగర్ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న టైంలో అనసూయ ఇలాంటి రకమైన ట్విట్ చేయడం ..విజయ్ అభిమానులకు పుండు మీద కారం చల్లిన్నత్లు ఉంది. దీంతో అనసూయను ఆంటీ అంటూ పచ్చి బూతు పదాలు వాడుతూ ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే అనసూయ కూడా విజయ్ దేవరకొండ అభిమానులకు ఘాటైన విధంగా ఆన్సర్ ఇస్తూ.. తనని ట్రోల్ చేసే వారిపై ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతానంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చింది. అంతేనా గత కొన్ని గంటల నుంచి అనసూయ సోషల్ మీడియాలో వరుసగా తనని ట్రోల్ చేస్తున్న వారికి ఆన్సర్ ఇస్తూనే వస్తుంది .

ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. అనసూయకు ఈ విధంగా ట్వీట్ చేశాడు . “ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకోవడం మీ పెద్దరికం అంటారా..?. ఇది ఎంతవరకు కరెక్ట్ ..?అండి” అంటూ ప్రశ్నించాడు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..” అదే ఇండస్ట్రీలో ఉంటూ డబ్బులు ఇచ్చి ఓ ఓ ఆడదాని పై, మదర్ పై, తోటి ఆర్టిస్ట్  ను మాదర్*** అని అనిపించడం ఎంతవరకు కరెక్ట్.. అండి.. నా ప్లేస్ లో మీరు ఉంటే ఆ బాధ మీకు తెలిసి ఉండేది..? అలాంటి వారిని మీరు క్షమించగలరా ..?” అంటూ తిరిగి ప్రశ్నించింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంటే పరోక్షంగా అనసూయ లైగర్ సినిమా ప్లాప్ ను ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు జనాలు. దీంతో అనసూయ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బూతులు వర్షం కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news