దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఆయన సినిమాల్లో నటించాలన్నా… సినిమాకు ఓకే చెప్పాలన్నా… కథ వినాలన్నా కూడా ముహూర్తం పట్టింపులు ఉంటాయి. అదే సెంటిమెంట్లను ఆయన తనయుడు బాలకృష్ణ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన వారసులు, వారసురాళ్ల పేర్ల విషయంలో కూడా ఒకే విధమైన సెంటిమెంట్ ఫాలో అయ్యారు. తన కుమారులు అందరి పేర్ల చివర కృష్ణ అని వచ్చే రామకృష్ణ – మోహనకృష్ణ – జయకృష్ణ – హరికృష్ణ – బాలకృష్ణ అని పేర్లు పెట్టారు.
అలాగే ఎన్టీఆర్ తన నలుగురు కుమార్తెలకు చివర శ్వరి పేరు వచ్చేలా పెట్టారు. లోకేశ్వరి – పురందేశ్వరి – భువనేశ్వరి – ఉమామహేశ్వరి అని పేరు కలిసేలా పేర్లు పెట్టారు. ఎన్టీఆర్ కావాలని తన కుమారులకు.. కుమార్తెలకు ఇలా పేర్లు పెట్టారని అంటుంటారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా తన ముగ్గురు వారసులకు పేరు చివర రామ అని వచ్చేలా పేర్లు పెట్టారు. పెద్ద కుమారుడు జానకిరామ్, రెండో కుమారుడు కళ్యాణ్‌రామ్, మూడో కుమారుడుకు తారకరామ్ అని పేరు పెట్టారు.
తన తండ్రి తమ అన్నదమ్ముల పేరు చివర కృష్ణ అన్న సెంటిమెంట్ వచ్చేలా ఫాలో అయితే… హరికృష్ణ మాత్రం తన వారసుల పేరు చివర రామ అని పేరు వచ్చేలా సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఇక హరికృష్ణ చిన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కు ముందు తారక రామ్ అని పేరు పెట్టారు. అయితే ఆ పేరును సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని మార్చేశారు.
అలా తారక రామ్ పేరు కాస్త తారక రామారావుగా మారింది. అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయిపోయాడు. సినిమా రంగంలో తాతకు తగ్గ వారసుడు అయిపోయాడు. తన తాతపై తన ఇష్టాన్ని ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులకు తన తాత రామారావు పేరు కలిసి వచ్చేలా అభయ్ రామ్, భార్గవ్‌రామ్ అని పెట్టుకున్న సంగతి తెలిసిందే.