Moviesబిగ్‌బాస్ 6 సీజ‌న్లో ఖ‌రీదైన టాప్ కంటెస్టెంట్ ఆమే... క‌ళ్లు చెదిరే...

బిగ్‌బాస్ 6 సీజ‌న్లో ఖ‌రీదైన టాప్ కంటెస్టెంట్ ఆమే… క‌ళ్లు చెదిరే డ‌బ్బులు…!

తెలుగు బుల్లితెర‌పై బిగ్‌బాస్ సీజ‌న్ మ‌ళ్లీ స్టార్ట్ అవుతోంది. గ‌త యేడాదిలోనే ఏకంగా బిగ్‌బాస్ తో పాటు ఓటీటీ బిగ్‌బాస్ సంద‌డి కూడా బాగానే న‌డిచింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ బుల్లితెర‌పై బిగ్‌బాస్ సంద‌డి స్టార్ట్ కానుంది. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6కు సంబంధించిన కొత్త ప్రోమో వ‌చ్చేసింది. షో టెలికాస్ట్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. ఈ నెల చివ‌రి వారంలోనే షో ప్రారంభం కానుంది.

గ‌త రెండు సీజ‌న్ల మాదిరిగానే ఈ నెల చివ‌రి వారంలో షో ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు. గ‌తంలో లాగానే ఈ సారి కూడా ప‌ది రోజుల ముందే కంటెస్టెంట్లు అంద‌రూ కూడా క్వారంటైన్‌కు వెళుతున్న‌ట్టు స్టార్ మా వ‌ర్గాల స‌మాచారం. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్ల గురించి ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్ల గురించి కూడా ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

సీనియ‌ర్ హాట్ యాంక‌ర్ ఉద‌య‌భాను 6వ సీజ‌న్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆమె రెండున్న‌ర ద‌శాబ్దాలుగా తెలుగు బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తూ వ‌స్తోంది. న‌టిగా కూడా చాలా సినిమాలు చేసింది. బుల్లితెర‌పై త‌న‌దైన ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఆమె ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇంత‌కు ముందు జ‌రిగిన బిగ్‌బాస్ పోటీల్లోనే ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌నుకున్నారు.

అయితే ఇప్పుడు ఆమె ఇద్ద‌రు అమ్మాయిలు పెద్ద‌వాళ్లు అయ్యారు. దీంతో ఆమె ఎలాంటి టెన్ష‌న్స్ లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ట‌. ఇక బిగ్‌బాస్ 6వ సీజ‌న్లోనే హ‌య్య‌స్ట్ ఫెయిడ్ కంటెస్టెంట్‌గా ఉద‌యభాను ఎంపికైంద‌ని అంటున్నారు. ఆమె రెమ్యున‌రేష‌న్‌గా రోజుకు ల‌క్ష‌ల్లోనే నిర్వాహ‌కులు ఫిక్స్ చేశార‌ట‌. ఇది బిగ్ చ‌రిత్ర‌లోనే హ‌య్య‌స్ట్ అంటున్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news