రీమాసేన్..చిత్రం సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన తేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మారుతూ చేసిన మొదటి సినిమా చిత్రం. ఈ సినిమాతో హీరోగా ఉదయ కిరణ్, హీరోయిన్‌గా రీమాసేన్ సహా దాదాపు అందరూ కొత్తవారే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. రామోజీరావు ఈ సినిమాకు నిర్మాత. అప్పట్లో అత్యంత తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది.
కేవలం రు. 33 లక్షలు బడ్జెట్ ఇచ్చిన తేజతో రామోజీరావు.. ఈ డబ్బులు నేను లాస్ కింద రాసుకుంటాను అని చెప్పారు. అంటే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయనకు లేదు. మొత్తం సినిమా పూర్తయ్యేసరికి ఇంకో నాలుగైదు లక్షలు వరకు ఖర్చైంది. అయిత్రం సినిమా రిలీజై రాబట్టిన వసూళ్ళు రు. 10 కోట్లు. ఇది అప్పట్లో సంచలనం. ముఖ్యంగా ఈ మూవీకి పని చేసిన దాదాపు అందరికీ స్టార్ డం వచ్చింది.
దర్శకుడిగా తేజ, హీరో, హీరోయిన్స్‌గా ఉదయ్ కిరణ్, రీమాసేన్..సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్..ఇలా అందరికీ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా రీమా సేన్ అంటే అప్పట్లో యూత్ పడి చచ్చారు. రసగుల్లా ఉన్న అమ్మడిని బాత్రూం, బెడ్రూం లలో పెట్టుకున్నారు. అమ్మడికి అవకాశాలు అలాగే వచ్చాయి. ఇదే ఉదయ కిరణ్ – రీమా సేన్ కలిసి నటించిన మనసంతా నువ్వే సినిమా పెద్ద హిట్.
అలా అదృష్టం, వీడే, బావ నచ్చాడు, సీమ సింహం లాంటి సినిమాలలో అలాగే అంజి, నీ మనసు నాకు తెలుసు లాంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. హిందీలో కూడా హీరోయిన్‌గా నటించింది.
తక్కువ టైంలోనే ఆమెకు చిరంజీవి, నాగార్జున, బాలయ్య పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. అయితే, పెద్ద హీరోల సరసన నటించే మెచ్యూరిటీ రోల్స్ గానీ, అలాంటి సినిమా అవకాశాలు దక్కలేదు. కారణం తన ఫిజిక్..ఏజ్.
అప్పట్లో మరీ చిన్న హీరోయిన్ సరసన నటించడానికి మన హీరోలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. నాగార్జున సరసన నటించినా కూడా ఆ సినిమాలు హిట్ సాధించలేదు. దాంతో ఇలాంటి హీరోయిన్‌కి పెద్ద హీరోల సరసన తీసుకోవడం ఎందుకులే అని భావన వచ్చి మేకర్స్ పెద్ద ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు. దాంతో మంచి ఫ్యూచర్ ఉన్న త్వరగానే అడ్రస్ లేకుండా పోయింది రీమాసేన్.