Moviesఆ హీరోయిన్ చెప్పిన డైలాగులే బాల‌య్య సినిమా టైటిల్స్‌... ఆమె ఎవ‌రో...

ఆ హీరోయిన్ చెప్పిన డైలాగులే బాల‌య్య సినిమా టైటిల్స్‌… ఆమె ఎవ‌రో తెలుసా…!

న‌ట‌సింహం బాల‌కృష్ణ సినిమాల టైటిల్స్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స‌మ‌ర‌సింహారెడ్డి, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, న‌ర‌సింహానాయుడు, యువ‌ర‌త్న రాణా, సీమ‌సింహం, రూల‌ర్‌, జైసింహా, ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు, ల‌య‌న్‌, డిక్టేట‌ర్‌, సింహా, లెజెండ్‌, అఖండ ఇలా అన్నీ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. ఈ వ‌య‌స్సులో కూడా బాల‌య్య కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

అఖండ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌స్తుతం బాల‌య్య వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులే చేస్తున్నాడు. మ‌లినేని గోపీచంద్ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి, ఆ త‌ర్వాత పూరి, బోయ‌పాటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాల‌య్య సినిమాల టైటిల్స్‌లో ఓ లాజిక్ ఉంది. బాల‌య్య‌తో ఓ సినిమాలో న‌టించిన ఓ హీరోయిన్ చెప్పిన డైలాగుల‌నే వ‌రుస‌గా బాల‌య్య సినిమాల‌కు టైటిల్స్‌గా పెట్ట‌డం విచిత్రంగా జ‌రుగుతూ వ‌స్తోంది.

బాల‌య్య లెజెండ్ సినిమాలో రాధికా ఆఫ్టే హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలో రాధిక బాల‌య్య పాత్ర‌ను ఉద్దేశించి కొన్ని డైలాగులు చెపుతుంది. అతను ఒక లయన్, ఒక డిక్టేటర్, ఒక రూలర్ అంటూ డైలాగులు ప‌వ‌ర్ ఫుల్‌గా చెపుతుంది. ఆ త‌ర్వాత ఈ డైలాగుల్లో ఉన్న ప‌దాలే వ‌రుస‌గా బాల‌య్య సినిమాల‌కు టైటిల్స్‌గా వ‌చ్చాయి. 2014లో లెజెండ్ వ‌స్తే.. ఆ మ‌రుస‌టి యేడాది 2015లో ల‌య‌న్ సినిమా వ‌చ్చింది.

2016 సంక్రాంతికి డిక్టేట‌ర్ వ‌చ్చింది. నాలుగు సినిమాల పోటీలో వ‌చ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క్రిస్మ‌స్‌కు రూల‌ర్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాల త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. అలా ఆ హీరోయిన్ చెప్పిన డైలాగును బ‌ట్టే ఏకంగా బాల‌య్య మూడు సినిమాల‌కు టైటిల్స్‌గా పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news