విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ సినీ రంగంలో అనేక రికార్డులు సృష్టించారు. ఆయ న చేసిన సినిమాలు ఉమ్మడి ఏపీలో (అప్పటి మద్రాస్ రాష్ట్రం) రికార్డులు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలకు కేవలం తెలుగు ప్రజలే కాకుండా.. తమిళ, కన్నడ, హిందీ ప్రజలు కూడా కనెక్ట్ అయిపోయారు. అందుకే ఆయన చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటకీ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఒక రాముడు, కృష్ణుడిగా నిలిచిపోయాడు.
అన్నగారి సినిమా వస్తోందంటే..ఊరూ వాడా పండగే. ఇది ఒక పార్శ్వం అయితే.. మరో కోణం కూడా ఉంది. అన్నగా రి సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి యూనిట్ అంతా పండగ చేసుకునేదట. చివరి రోజు.. షూటింగ్ అనగానే.. అన్నగారితోపాటు.. హీరోయిన్, ఇతర నటులను ప్రత్యేకంగా పిలిపించే వారు. అప్పట్లో నిర్మాతలు ప్రత్యేకంగా ఉండేవారు.. కాదు. నిర్మాణ సంస్థలే అన్నీ చూసుకునేవి. వీరిని ఉద్యోగులుగా నియమించుకున్న విషయం తెలిసిందే. మరుసటి సినిమాకు కూడా ముందుగానే షెడ్యూ ల్ ఖరారు చేసుకునేవారు.
అయితే.. ఏ సినిమా షూటింగ్ పూర్తవుతున్నా.. చివరి రోజు.. అందరినీ పిలిచి విందు ఇవ్వడం.. అప్పట్లో వాహినీ, జెమినీ స్టూడియో నిర్మాతలకు ఆనవాయితీ. తమిళనాట సినిమా రంగంలో ఈ సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఏ సినిమా షూటింగ్ పూర్తయినా.. ఇప్పటికీ.. యూనిట్‌లో అందరినీ పిలిచి.. విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక అన్నగారి సినిమాల్లో.. సావిత్రి ఎక్కువగా నటించారు. ఆమె భోజన ప్రియురాలు. పైగా మాంసాహార ప్రియురాలనే విషయం కూడా తెలిసిందే.
అన్నగారికి కూడా మాంసాహారం అంటే.. అత్యంత ప్రియత్వం. అందుకే.. చివరి రోజు షూటింగ్ అయినా.. విందు ఏర్పాటు చేసినా.. సావిత్రి ప్రత్యేకంగా.. అన్నగారి కోసం.. వంటకాలు చేయించి తెచ్చేవారట.
అన్నగారితోపాటు.. నటీనటులకు సరిపడా.. పీతలు, రొయ్యలు.. చేపల పులుసుతో పాటు.. నాటు కోడితో రెండు మూడు రకాల పదార్థాలు చేయించి తెచ్చేవారట.
దీంతో అన్నగారితో పాటు దర్శకులు.. సంగీత దర్శకులు.. కూడా లొట్టలేసుకుని మరీ తినేవారట. ఆ తర్వాత.. ఈ సంప్రదాయాన్ని శారద కొన్నాళ్లు పాటించారు. తర్వాత.. వాణిశ్రీ కొనసాగించారు. వాణి శ్రీ కూడా ఎన్టీఆర్ కోసం రకరకాల వంటకాలు వండి తెచ్చి సెట్లో ఆయనకు పెట్టేవారట. ఇక, క్యారెక్టర్ ఆర్టిస్టు. నిర్మలమ్మ కూడా.. కొనసాగించారు. ఇదీ.. సంగతి!!