సినీ ఇండస్ట్రీలో లెక్క లు మారుతున్నాయి. మన అనుకున్నవి మనవి కాకుండా పోతున్నాయి. పరాయి అనుకున్నవి మనవే అనే పోజీషన్స్ లో కి వచ్చేస్తున్నారు జనాలు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే బడా హీరోలు, పెద్ద మనుషులు..డబ్బులు..పెద్ద పెద్ద ఫంక్షన్లు ఇవే. కానీ, నేటి కాలంలో లెక్కలు మారుతున్నాయి. చిన్న సినిమాలు కూడా భారీ స్దాయిలో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. బిగ్ సినిమాలు నిర్మాతలకు బొక్క వేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో బడా బడా సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా..గురించే. పాపం ఈ సినిమాను వీలైనంత మంది స్టార్స్ తమకు తోచిన విధంగా ప్రమోట్ చేసారు. కానీ, రిజల్ట్ మాత్రం శూన్య, లా కనిపిస్తుంది. ఫస్ట్ షో నుండే బొమ్మ అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కొందరు అయితే బాయ్ కాట్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే..హీరోయిన్ కరీనా కపూర్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. “ప్లీజ్ ఈ సినిమా ని ఆపొద్దు. ఈ సినిమా కోసం 250 మంది పేద ప్రజలు వర్క్ చేసారు. ఈ సినిమాను ఆపితే వాళ్ల పొట్టకొట్టినవాళ్లం అవుతాం..”అంటూ ఎమోషనల్ నోట్ చేసింది. దీనికి కౌంటర్ ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. ఘాటు ట్వీట్ చేసాడు.”మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా బాలీవుడ్ మాఫియా అడ్డుకున్నప్పుడు ఆ నొప్పి లేదా కరీనా..? ఆ టైంలో ఎవరు మాట్లాడలేదేంటి? అప్పుడు కూడా ఆ చిన్న చిత్రాలకు దాదాపు 250 మంది పేదలే వర్క్ చేసారు.
వాళ్ల బతుకుల గురించి ఎవరు ఆలోచించారు? కొందరు బాలీవుడ్ కింగ్స్ అంటూ చెప్పుకునే స్టార్స్ బయట నుంచి వచ్చిన దర్శకులు, నటులు, రచయితల కెరీర్‌ను నాశనం చేస్తుంటే ..సైలెంట్ గా ఉన్నారే తప్పిస్తే..ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా ఇన్నాళ్ళు జరిగిఉండచ్చు..కానీ ఇక పై అలా జరగదు. సామాన్య భారతీయులు ఏనాడు అయితే బాలీవుడ్ డాన్ల అహంకారం, ఫాసిజం, హిందూఫోబియా గురించి తెలుసుకుంటారో..ఆ రోజునే వాళ్లని వేడి కాఫీలో ముంచేస్తారు. జాగ్రత్త’ అని హెచ్చరించాడు.