సినీ రంగంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారుచాలా మంది ఉన్నారు. కెరీర్‌లో చాలా ఉన్నత స్థాయిని అనుభవించిన నటీనటులు.. ఎవరూ ఊహించని రీతిలో అనేక మెట్లు ఎక్కిన వారికి కూడా ఆర్థిక సమస్యలు తప్పలేదు. ఎంతో సంపాదించుకున్న నాగయ్య, చలం..వంటి వారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇవన్నీ వారు.. చేసిన దాన ధర్మాలు.. ఆర్థిక క్రమ శిక్షణ లేక పోవడం వంటి కారణంగానే తలెత్తాయని ఇండస్ట్రీలో చెబుతుంటారు.
అయితే.. ఆది నుంచి కూడా ఆర్థికంగా ఎంతో క్రమ శిక్షణతో మెలిగిన అన్నగారు, ఎన్టీఆర్ కు కూడా ఆర్థిక సమస్యలు తలెత్తాయని.. తెలుసా? 100 రూపాయల కోసం.. ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుసా? అలానే..సీనియర్ నటి.. వైజయంతి మాల కూడా ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఆర్థిక క్రమ శిక్షణను పాటించిన వారే. అయినా.. కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి పెద్ద పెద్ద కారణాలు కావు.. చిన్న చిన్న రీజన్ల వల్లే.. వీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
అన్నగారు.. కెరీర్ ప్రారంభంలో చాలా తక్కువ పారితోషికానికి (జీతానికి) పనిచేసేవారు. నెలకు రూ. 70 నుంచి 100 రూపాయలకే ఆయన స్టూడియోల్లో పనిచేశారు. ఈ సొమ్ముతోనే నెలంతా గడిపేవారు. అయితే .. ఎవరు కొత్తవారు వచ్చినా.. ఎన్టీఆర్ రూంలోనే బస చేసేవారు. ఆయనతోనే కలిసి.. ఉండేవారు. దీంతో వారి ఖర్చులు కూడా అన్నగారిపైనే పడేవి. అన్నగారికి మొహమాటం ఎక్కువ. ఇలా.. చాలా వరకు వచ్చిన సొమ్మును వారికి కూడా ఖర్చు చేయడంతో తొలినాళ్లలో ఇబ్బందులు తప్పలేదు.
ఇక,వైజయంతి మాల విషయంలో.. మాత్రం రూ.50కే ఆమె స్టూడియోల్లో పనిచేయాల్సి వచ్చింది. దీంతో వచ్చింది సరిపోక.. అందిన కాడికి అప్పులు చేయడం.. వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడడం.. సర్వసాధారణంగా మారిందని చెప్పుకొనేవారు. అయితే.. తర్వాత తర్వాత.. సినిమాలు పుంజుకోవడంతో అటు అన్నగారు.. ఇటు వైజయంతి మాల కూడా పుంజుకున్నారు.
ఇక, అటు తర్వాత.. ఇద్దరు కూడా.. వెనక్కి తిరిగి చూసుకోకుండా.. ప్రతి రూపాయినీ జాగ్రత్త చేసుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. అందరూ బాగా సంపాదించుకున్నాక.. ఇబ్బందులు పడితే.. తొలినాళ్లలో వీరు ఇబ్బందులు పడడం గమనార్హం.