ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోల డేట్లను బట్టి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది.. ఎప్పుడు ముగుస్తుంది అన్న ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్, క్రేజీ హీరోయిన్ రష్మిక విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరుగుతోంది. ఆమె ఎప్పుడు చెపితే అప్పుడే హీరోలు డేట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. దీనిని బట్టే రష్మిక డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
నాగచైతన్య తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చైతు మరికొన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే 14 రీల్స్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లో పరశురాం దర్శకత్వంలో చైతుది ఓ సినిమా ఉంది. ఈ సినిమా స్టార్ట్ కావాలంటే రష్మిక దయ తలవాల్సి ఉందట.
ఈ సినిమాలో చైతుకు జోడీగా ఆమెనే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే చైతు హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా ఉంది. ఆ సినిమాకు కూడా రష్మికనే అనుకుంటున్నారట. అంటే చైతుకు జోడీగా రెండు సినిమాల్లో రష్మికనే హీరోయిన్ అన్నమాట. వెంకట్ ప్రభు సినిమా కోసం కూడా రష్మిను డేట్లు అడిగితే తాను ఎప్పుడు ఇస్తానో చెప్పలేనని తేల్చేసిందట.
రష్మిక చెప్పిన ఈ మాట బట్టే ఆమె ఎంత బిజీ షెడ్యూల్‌తో ఉందో అర్థమవుతోంది. దీంతో నిర్మాతలకు దిమ్మతిరిగినంత పనైంది. ఎందుకంటే వెంకట్ ప్రభు సినిమా కంటే ముందు పరశురాం సినిమాకు కూడా ఆమే హీరోయిన్. అయితే ఆమె డేట్లు ఎప్పుడు ఇస్తుందో ? తెలియక వాళ్ల వెయిటింగ్‌లో ఉన్నారు. ముందు ఆ సినిమాకు డేట్లు ఇచ్చి పూర్తయ్యాకే వెంకట్ ప్రభు సినిమాకు.. అది కూడా ఎప్పుడు ఇస్తానో చెప్పలేనని కండీషన్ పెట్టడం అంటే మామూలు బిజీ కాదు.