Moviesఇక పై రామ్ ని మనం అలా చూడలేం..ఎనర్జిటిక్ హీరో...

ఇక పై రామ్ ని మనం అలా చూడలేం..ఎనర్జిటిక్ హీరో సంచలన నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో మన హీరోల సినిమాలు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరోలు కాదు నార్మల్ స్టైల్ హీరోల సినిమాలు కూడా ఆశించినంత స్థాయి హిట్ అందుకోలేకపోతున్నాయి. రామ్ చరణ్ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన ఆచార్య సినిమా ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. కాగా ఆ క్రమంలోనే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన సినిమా ది వారియర్ కూడా ఫ్లాప్ అయింది.

మనకు తెలిసిందే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి. అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు చూసిన జనాలు ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ మనం అనుకున్నట్లు జరగలేదు. అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతే. మనం అనుకున్నది ఏదీ జరగదు. ఈ క్రమంలోనే లింగు స్వామి డైరెక్ట్ చేసిన రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రామ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేశారు జనాలు.

ఆ సినిమా కధ పాతగా ఉండడం.. తీసిన సీన్స్ మళ్లీ తీసి .. రామ్ ని అదే లుక్ లో చూడడం జనాలకు బోర్ కొట్టేసింది. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయినట్టు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే రామ్ తన నెక్స్ట్ సినిమా బోయపాటితో తెరకెక్కబోయే మూవీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రామ్ పోతినేని దాదాపు 15 కేజీలు బరువు పెరగనున్నట్లు సినీ వర్గాలలో వార్త వైరల్ గా మారింది.

ఎందుకంటే ఈ సినిమాలో కరామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడట. దీనికోసం రామ్ ఏకంగా 15 కేజీల బరువు పెరగడానికి సిద్ధపడ్డాడట. సన్నగా ఉన్న రామ్ ఈ సినిమా కోసం కొంచెం బొద్దుగా పెద్దరికంగా కనిపించాలని బోయపాటి చెప్పడంతో సినిమా కోసం ఏమైనా చేస్తానని రామ్ 15 కేజీల పెరగడానికి ఓకే చెప్పాడట. దీంతో ఈ విషయాన్ని మీడియాలో వైరల్ చేస్తున్నారు రామ్ పోతినేని ఫ్యాన్స్. కచ్చితంగా ఈ సినిమా రామ్ కెరియర్ లో వన్ అఫ్ ది బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలవనుందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మరి చూడాలి రామ్ ఈ సినిమా ద్వార ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news