పూరి చేతిలో పడింది..అనన్య పాండే పనికూడా అదేనా ఇక..? అంటూ ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకుండా లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ ఈ నెల 25న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ పోతినేని హీరోగా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్‌తో పూరి ఫుల్ ఫాంలోకి వచ్చి విజయ్‌తో తన మార్క్ సినిమాగా అది కూడా పాన్ ఇండియా లెవల్లో లైగర్ రూపొందించారు.
సాధారణంగా పూరి జగన్నాథ్ ఒక హీరోయిన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారంటే మిగతా మేకర్స్ దృష్ఠి మొత్తం ఆ హీరోయిన్ మీదే ఉంటుంది. పూరి సినిమా రిలీజ్ కాకముందే ఆ హీరోయిన్ని అవకాశాలు క్యూ కడుతుంటాయి. అయితే, పూరీ హీరోయిన్ అంటే ఇంకో టాక్ కూడా ఉంది. ఆయన సినిమాలకు తప్ప మిగతా మేకర్స్ అంతగా హ్యాండిల్ చేయలేరని. అంతేకాదు, ఆయన పరిచయం చేసిన హీరోయిన్స్ కొందరూ ఒక్క సినిమాతోనే సర్దుకొని వెళ్ళిపోయారు.
కెమెరా యాంగిల్స్ కొత్తగా పెట్టి లేని అందాన్ని చూపించి మేనేజ్ చేస్తారు పూరి అని చెప్పుకునేవారు లేకపోలేదు. దీనికి ఉదాహరణ రవితేజతో పూరి జగన్నాథ్ రూపొందించిన నేనింతే సినిమా. ఇందులో శియా గౌతమ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తప్ప మళ్ళీ హీరోయిన్గా టాలీవుడ్లో కనిపించలేదు. ఈమె ఒక్కరే కాదు, లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశాపఠాని, ఇజం సినిమాతో పరిచయమైన అదితి ఆర్య కూడా అడ్రస్ లేకుండా పోయారు.
ఇప్పుడు బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా అని టాక్ వినిపిస్తుంది. లైగర్ పాన్ ఇండియా రేంజ్లో రూపొందింది. ఒకవేళ సక్సెస్ అయితే సౌత్‌లో కనీసం ఏదో ఒక భాషలలోనైనా నెట్టుకొస్తుంది. లేదంటే లైగర్ లాస్ట్ అంటున్నారు. మరి బాలీవుడ్ సంగతేంటో అమ్మడికి అక్కడున్న క్రేజే చెప్పాలి. పూరి లైగర్ భామ అని చెప్పుకుంటున్న అనన్యకి ప్రస్తుతం మాత్రం అంతగా సౌత్‌లో క్రేజ్ లేదనే చెప్పాలి.