నందమూరి నటసింహం బాలకృష్ణ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 107వ సినిమా షూటింగ్ జరుగుతుంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలు అందిస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత… అటు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన మలినేని గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో. ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అఖండ సినిమాకు మించిన ప్రి రిలీజ్ బిజినెస్, అడ్వాన్సులు ఈ సినిమాకు వస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో బాలయ్య 108వ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సాహూ గారపాటి, చంటి పెద్ది కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. బాలయ్య నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి లైన్ లో ఉండడంతో నందమూరి అభిమానుల్లో ఎక్కడాలేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే బాలయ్య 107వ సినిమాపై త్వరలోనే అదిరిపోయే అప్డేట్ బయటకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ – ఫస్ట్ లుక్ టీజర్లు దుమ్ము రేపేశాయి. అయితే టైటిల్ గా ఏది ఫిక్స్ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే జై బాలయ్య, లేదా రెడ్డి గారు అన్న రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారని, ఈ రెండు టైటిల్స్ లో ఒకటి కచ్చితంగా కన్ఫామ్ చేస్తారని ఈ సినిమా వర్గాల సమాచారం. వచ్చే దసరాకు ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అంచనాలు ఆకాశంలో ఉండగా దసరాకు టైటిల్ రిలీజ్ అయితే సినిమాకు భయంకరమైన హైప్ రావటం ఖాయంగా కనిపిస్తోంది.