యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం 20 సంవత్సరాల వయసులోనే టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ అయిపోయాడు. 20 సంవత్సరాలకే ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. ఈ మూడు హిట్ల దెబ్బతో ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు వచ్చిన క్రేజ్.. కలెక్షన్లు చూసి టాలీవుడ్ సీనియర్ హీరోలు సైతం షాక్ అయిపోయారు. 20 సంవత్సరాల ఈ బుడ్డోడికి తెలుగు గడ్డపై ఎంత క్రేజ్ ఏంట్రా ? బాబు అని తలలు పట్టుకున్నారు. సంవత్సరాల పాటు తెలుగు సినిమాను శాసించిన స్టార్ హీరోలకు సైతం అప్పట్లో ఎన్టీఆర్ క్రేజీ చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది.
స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి ఈ మూడు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ఆయన ఇంటికి క్యూ కట్టారు. అప్పటికే పూరి జగన్నాథ్ ఇడియట్ – అమ్మానాన్న తమిళ అమ్మాయి – ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇడియట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ – చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తుందన్న ప్రచారం జరిగింది. ఆ కాంబినేషన్ మిస్ అవ్వడంతో వెంటనే పూరి జగన్నాథ్ ఎన్టీఆర్‌కు కథ చెప్పి ఆంధ్రావాలా సినిమా చేశాడు. 2004 జనవరి 1వ తేదీన రిలీజ్ అయిన ఆంధ్రావాలా అంచనాలు అందుకోలేదు.
అప్పటివరకు ఎన్టీఆర్‌ను ఆది – సింహాద్రి లాంటి పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూసిన తెలుగు ప్రజలు ఆంధ్రావాలాలో ఆ పాత్రల్లో ఎన్టీఆర్‌ను ఊహించుకోలేకపోయారు. దీంతో ప్రేక్షకులకు ఆ కథ కరెక్ట్ కాకపోవడంతో ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి అని మూడు ప్రత్యేక ట్రైన్లు వేసి మరి నాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న అభిమానులను నిమ్మకూరుకు తరలించారు. ఈ మూడు ట్రైన్లు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి మరి గుడివాడకు చేరుకున్నాయి.
ఓ తెలుగు హీరో సినిమా ఫంక్షన్లకు ప్రత్యేకంగా ఆ హీరో హిట్ సినిమాల పేర్లతో ట్రైన్లు వేసి అభిమానులను తరలించటం భారతదేశ సినీ చరిత్రలను పెద్ద సంచలనం రేపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా రక్షిత హీరోయిన్‌గా నటించింది. దీనికి తోడు చక్రి ఇచ్చిన పాటలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే చాలామంది అభిమానులు నిమ్మకూరు, గుడివాడ రహదారులు కిక్కిరిసిపోవడంతో ఆడియో ఫంక్షన్ వేదిక దగ్గరకు కూడా వెళ్లకుండానే తిరిగి వచ్చేశారు. ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం లక్షల సంఖ్యలో వచ్చిన ఎన్టీఆర్ అభిమానులను చూసి భయపడి తాను కూడా వెనక్కు వచ్చేసానని లైగర్ సినిమా ప్రమోషన్లలో నాటి విషయాన్ని బయటపెట్టారు.
అసలు ఆ జన సందోహం గురించి తరచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుందని కూడా పూరి జగన్నాథ్ చెప్పారు. విచిత్రం ఏంటంటే అంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్రావాలా ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా వచ్చిన 11 సంవత్సరాలకే పూరి మళ్లీ అదే ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసి హిట్టు కొట్టాడు. ఏదేమైనా ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది.