విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కి నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టాక్ నుంచే లైగర్ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదని.. కనీసం ఒక మోస్తరుగా కూడా లేదని విజయ్ దేవరకొండ కెరీర్ లోనే పరమ చెత్త సినిమాలలో ఒకటి అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన టాక్ ను బట్టి చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిలిస్తుందని క్లారిటీ వచ్చేసింది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసి పెద్ద షాక్‌లోకి వెళ్లిపోయాయి.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా కథను ఎన్టీఆర్‌కు చెప్పారట. 2015లో ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో టెంపర్ సినిమా వచ్చింది. వరుస ప్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు.. అటు పూరీకి ఇద్దరికీ టెంపర్ సినిమాతో మంచి బూస్టప్ వచ్చింది. టెంపర్ హిట్ అయ్యాక పూరికి కూడా క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ వరుస ప్లాపులకు బ్రేక్ పడింది. దీంతో వెంటనే మరోసారి ఎన్టీఆర్‌ను ఏదోలా బుట్టలో పెట్టేసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు పూరి.
అప్పుడు లైగర్ కథను 2016లో ఎన్టీఆర్‌కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరి ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబి హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండడంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.
టెంపర్‌కు ముందే 2004లో పూరి – ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఎంత పెద్ద ప్లాప్ అయ్యిందో చూశాం. అయితే ఎన్టీఆర్‌కు తనకు బాక్సర్ పాత్ర సూట్ అవ్వదన్న డౌట్‌తో ఆ సినిమాను వదులుకున్నాడు. లైగర్ చేసి ఉంటే అప్పుడే టెంపర్ హిట్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఎన్టీఆర్‌కు వెంటనే మరో ప్లాప్ సినిమా రావడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్ ఊపుకు బ్రేక్ పడేదని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏదేమైనా టైగర్ సినిమా లైగర్ రిజల్ట్ విషయంలో ఆరు సంవత్సరాల క్రితమే కరెక్ట్ గా జడ్జిమెంట్ చేశారని తెలుస్తోంది.