టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందచందాలతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన బ్యూటి. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే బిగ్ స్టార్స్ సినిమాలో నటించి..స్టార్ హీరోయిన్ల లిస్ట్ కు చేరిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని..బిడ్డను కూడా కన్నేసింది. ప్రజెంట్ ఇంట్లో భర్త బాబు తో చాలా హ్యాపీగా అసలైన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే, కాజల్ కి ఓ చెల్లి ఉంది. ఆమె పేరు నిషా..నిషా అగర్వాల్.
ఈమె కూడా సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సినిమాలకే తట్ట బుట్ట సర్దేసి..పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ బాబు కు మమ్మీ కూడా అయిపోయింది. కాజల్ , నిషా చాలా క్లోజ్..ఆ విషయాలు వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకునే పిక్స్ బట్టే తెలిసిపోతుంది. కాజల్ ప్రెగ్నెన్సీ టైంలో కాజల్ కన్నా కూడా ..నిషానే ఎక్కువ సంతోషపడింది. చాలా హ్యాపీ గా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. అప్పుడు అభిమానులు చాలా పొగిడేశారు ఆమెను.
అయితే, ఇపుడు మాత్రం బూతులు తిడుతున్నారు. నీకు వావి వరసలు లేవా అంటూ తిట్టిపోస్తున్నారు. దానికి కారణం…నిషా అగర్వాల్ తన బావ కి రాఖీ కట్టడం. నిజానికిన్ రాఖీ ఓ చెల్లి, లేదా అక్క అన్న లేదా తమ్ముడికి కడుతుంది. అదే మన సాంప్రదాయం. కానీ, ఇక్కడ ఈ బ్యూటీ బ్రదర్ ఇన్ లా అని కాకుండా బ్రదర్ అంటూ సంభోధిస్తూ..కాజల్ భర్త కు రాఖీ కట్టడం..అందరిని షాక్ కి గురి చేస్తుంది. కొందరు జనాలు నిషా అగర్వాల్ పై మండిపడుతున్నారు, మన సాంప్రదాయ విలువలను పాడు చేస్తున్నారు మీరు అంటూ ఫైర్ అవుతున్నారు.
View this post on Instagram