అయ్యో..అయ్యో అయ్యయ్యో..ఏంటి రా బాబు..అంత పెద్ద ఫ్యామిలికి ..కోట్ల ఆస్తులు ఉన్న కుటుంబానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ నా..? అంటూ కొందరు జనాలు జాలి పడుతుంటే ..మరికొందరు అభిమానులు బాధపడుతున్నారు. అక్కినేని హీరోలు అంటే చరిత్ర ను తిరగ రాసే విధంగా ఉండాలే కానీ..ఇలా చరిత్రలో నిలిచిపోయే చెత్త రికార్డులు నమోదు చేయకూడదు అంటూ కొందరు మండిపడుతున్నారు. అసలే కొడుకుల డివర్స్ లతో..బ్రేకప్ లతో సతమతమవుతున్న నాగ్ కి ..ఇలాంటి కామెంట్స్ పుండు మీదా కారం లా తయారైయాయి.
మనకు తెలిసిందే..నాగార్జున ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అనేది. శివ,గీతాంజలి, మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. మరి అలాంటి ఆయన కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం..ఇంకా సినిమా లు పాజిటీవ్ టాక్ తెచ్చునే రేంజ్ లోనే ఉన్నారు. నాగచైతన్య కూడా ఒకప్పుడు హిట్స్ కొట్టిన ఇప్పుడు మళ్ళీ వెనక పడిపోతున్నారు. రీసెంట్ గా వచ్చిన ధ్యాంక్యూ సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో మనం చూసిందే. ఇక ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది.
ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ పై కొత్త డౌట్లు మొదలైయ్యాయి. మరో వైపు అఖిల్ ఏజెంట్ కూడా 50-50 ఛాన్సెస్ లానే ఉంది. ఒక్కవేళ్ల బాక్స్ ఆఫిస్ వద్ద తండ్రి కొడుకుల సినిమాలు ఫ్లాప్ అయితే..ఉన్న పరువు కాస్త పోతుంది. అంతేకాదు, అదే టైంలో సమంత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలి కర్మ కాలి..వాళ్ల సినిమాలు ఫ్లాప్ అయినా..సమంత సినిమాలు హిట్ అయినా..ఇక ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ రేంజ్ డౌన్ అవుతుంది అని అంతున్నారు సినీ విశ్లేషకులు. ఒక్క వేళ్ల అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కి అది మామూలు షాక్ గా ఉండదు..అని సమంత ఫ్యాన్స్ రెచ్చకొడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్ మొదలైంది.