నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరీర్లో 107వ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతీహాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
వచ్చే డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా పట్టాలు ఎక్కేయనుంది. సాహు గారపాటి, చంటి పెద్ది నిర్మించే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అనిల్ రావిపూడి స్క్రిఫ్ట్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ లాక్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్నర్ సైడ్ టాక్ ? వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. థమన్ స్వరాలు అందిస్తున్నారు. అయితే అదే నెల చివరి వారంలో ఏప్రిల్ 28న మహేష్, త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుంది.
బాలయ్య సినిమా ఖచ్చితంగా అనుకున్న డేట్‌కు వచ్చేస్తే మహేష్ సినిమాకు బాలయ్య సినిమాకు మూడు వారాల గ్యాప్ ఉంటుంది. ఇబ్బంది ఉండదు. ఒక వేళ బాలయ్య సినిమా కాస్త లేట్ అయ్యి ఏప్రిల్ చివర్లో లేదా మే ఫస్ట్ వీక్‌కు వస్తే మహేష్ సినిమాకు ఇబ్బంది తప్పదు. ఈ రెండు సినిమాల మధ్య రెండు వారాలకు పైగా గ్యాప్ లేకపోతే కలెక్షన్ల కష్టాలు తప్పవు.