నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. త్వరలోనే యూరప్ షెడ్యూల్లో రెండు పాటలతో పాటు అమెరికాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఒక యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగివచ్చి ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాను ముందు నుంచి దసరాకు రిలీజ్ చేస్తారన్న ప్రచారం బలంగా జరిగింది.
అయితే మధ్యలో బాలయ్యతో పాటు ఈ సినిమా యూనిట్లో కొందరికి కరోనా రావడంతో షూటింగ్ కాస్త లేట్ అయింది. అందుకే దసరాకు రిలీజ్ అనుకున్న ఈ సినిమా వాయిదా పడి అఖండ సెంటిమెంట్ ఫాలో అవుతూ డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. బాలయ్య అఖండ గత ఏడాది డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి ఆయన కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాను డిసెంబర్ కంటే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య తిసిన సినిమాలను వరుసగా సంక్రాంతికి రిలీజ్ చేస్తూ హిట్ కొడుతున్నాడు. డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా లాంటి సినిమాలు సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో వచ్చి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని బాలయ్యతో పాటు నిర్మాతలు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ – మెగాస్టార్ – బాబీ సినిమా కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ – క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇంత పోటీ మధ్యలో బాలయ్య రంగంలోకి దిగితే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి దబిడి దిబిడి వాతావరణం ఉంటుంది. మరి మిగిలిన ముగ్గురు హీరోలు కూడా సంక్రాంతికి బాలయ్యతో పోటీకి సై అంటారా లేదా ? ఎవరైనా వెనక్కు తగ్గుతారా అన్నది చూడాలి. ఏదేమైనా వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బిగ్ ఫైట్ అయితే జరగనుంది.