Moviesక‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతికి శ‌త‌మానం భ‌వ‌తికి ఉన్న లింక్ ఇదే... క‌ళ్యాణ్‌కు...

క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతికి శ‌త‌మానం భ‌వ‌తికి ఉన్న లింక్ ఇదే… క‌ళ్యాణ్‌కు ఇన్ని స‌ల‌హాలు ఇచ్చిందా..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా న‌టించిన బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్‌కు మళ్ళీ ఆ స్థాయిలో సూపర్ హిట్ సినిమా బింబిసారతోనే దక్కింది. కళ్యాణ్ రామ్ కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ఎక్కువగా మాస్ మసాలా యాక్షన్ సినిమాలలో నటించాడు. కళ్యాణ్ రామ్ సినిమాలంటే విలన్, చితకబాదటం.. పంచ్ డైలాగులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కళ్యాణ్ రామ్ ముందు నుంచి నందమూరి అభిమానులను అలరించేందుకు మాస్ సినిమాలనే నమ్ముకుంటూ వచ్చాడు.

అయితే 118, బింబిసారా లాంటి వైవిద్యమైన కథలను ఎంచుకున్న కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఆలోచన దృక్పథంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా మాస్ మసాలా సినిమాలను నమ్ముకున్నా అవేవీ తనకు విజయాలను అందించ లేకపోవడంతో కళ్యాణ్‌ ఇప్పుడు కొత్త దర్శకులు… కొత్త కథల వైపు దృష్టిసారిస్తున్నాడు. ఇక బింబిసారా విజయంతో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. స్వాతి ఎవరు ? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

స్వాతి సంపన్న కుటుంబం నుంచి నందమూరి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టారు. వారికి ఫార్మా రంగంలో చాలా కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా స్వాతి సోదరుడు హరి కళ్యాణ్ రామ్‌కు సినిమాలపరంగా ఎప్పుడు అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బింబిసారా సినిమాకు కూడా హరి నిర్మాతగా నిర్మించారు. అలా స్వాతి ఫ్యామిలీ ఇప్పుడు కళ్యాణ్ రామ్‌కు అండదంటగా ఉంటూ వస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన ఇజం సినిమాలో కళ్యాణ్ రామ్ ఆ పాత్రకు తగినట్టుగా బరువు తగ్గటంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు.

ఇజం సినిమాలో కళ్యాణ్ రామ్ ఎంత స్టైలిష్ గా కనిపించాడో… ఆ పాత్ర మార్పులు వెనక నా భార్య సహాయం ఉందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ప్రతిరోజు కూడా కళ్యాణ్ రామ్ డైట్ చాలా పర్ఫెక్ట్ గా మెయింటెన్ చేయడంలో ఆమె కీలకంగా ఉండేదట. ఎప్పుడైనా తాను మోసం చేసి డైట్ ఫాలో అవ్వకుండా ఉందామని అనుకున్నా… స్వాతి మాత్రం ఎప్పుడైనా తనను ఓ కంట కనిపెడుతూ తాను కచ్చితంగా డైట్ ఫాలో అయ్యేలా చేసిందని కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమా చూసిన స్వాతి మీరు ఇలాంటి కుటుంబ కథా సినిమాలు చేయాలని… పంచ డైలాగ్ లు… ఫైట్లు చేయటం మానుకోవాలని తనతో చెప్పిందట. కథ‌ చాలా సింపుల్‌గా, ఫ్యామిలీని మెప్పించేలా ఉండాలని సినిమాలలో హింస తగ్గించుకోవాలని సూచనలు చేసిందట. ఇక స్వాతి కాలేజీ డ్రెస్ లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు వీరాభిమాని. అప్పట్లో కాలేజ్ ఎగ్గొట్టి మరి నాగార్జున సినిమాలు చూసేవారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news