కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఎంత అదృష్టమో ఈ పాపది..అంటున్నారు జనాలు. ఒకప్పుడు బడా హీరోలతో, డైరెక్టర్లతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో కి వచ్చిన అతి కొద్ది టైంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది . అంతేనా ఇప్పుడు సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డును నెలకొల్పింది. దీంతో నయనతార పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. కాగా నయనతార ఒకప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా.. ఎంతమందితో తిరిగినా.. ప్రజెంట్ మాత్రం తన భర్తనే తన సర్వస్వం అంటూ మొత్తం తన జీవితాన్ని తన భర్తకి అంకితం చేసేసింది.
మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిన సంగతి. కొన్నాళ్ళు హ్యాపీగా లవ్ చేసుకున్న ఈ జంట ఈ మధ్యనే తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో చాలా వైరల్ గా మారాయి. నయన్ కట్టుకున్న చీర.. ధరించిన నగలు.. విగ్నేష్ శివన్ పట్టు పంచే ..ట్రెడిషనల్ లుక్స్ చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈ జంట. అంతేకాదు వీళ్ల హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను సైతం ఈ జంట అభిమానులతో పంచుకుంది.
మెడలో తాళ్లితో హాట్ డ్రెస్ తో ..నయన్ ను ప్రేమగా ముద్దాడుతున్న విగ్నేష్ ..అబ్బో ఆ ఫోటోలు చూస్తే మతులు పోవాల్సిందే .అలా ఉన్నాయి ఆ ఫోటోలు. రీసెంట్ గా సెకండ్ ట్రిప్ హనీమూన్ కి వెళ్ళింది ఈ జంట. ఫారం లొకేషన్స్ లో రొమాంటిక్ ప్లేస్ లో హగ్గులు, ముద్దులు, అంటూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్ని ఉత్సాహపరస్తున్నారు న్యూ కపుల్.
ఈ జంట సెకండ్ హనీమూన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదట . ఓ ప్రముఖ సంస్థ ఈ సెకండ్ హనీమూన్ కోసం స్పాన్సర్ గా నిలిచిందట . ఫలితంగా అదేశీ విహార యాత్ర కం హనీమూన్ ను నయన్ విగ్నేష్ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఉండే హోటల్ రూమ్ దగ్గర నుంచి వీళ్ళు తిరిగే ప్రదేశాలు తినే ఫుడ్ తిరిగే కార్ అన్ని కూడా ఆ ప్రముఖ సంస్ధే హనీమూన్ గిఫ్ట్ గా స్పాన్సర్ చేసిందట . దాదాపు ఈ జంట ఒక్క రోజుకు రెండు లక్షల 80000 ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక మిగతా ఖర్చుల సంగతి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి..! దీంతో నయనతార అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు మిగతా హీరోయిన్లు..!