ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో తీపి కబుర్లు ఎక్కువైపోయాయి. యంగ్ హీరోస్ యంగ్ హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకటి అయిపోతున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో బోలెడు మంది హీరోలు వచ్చారు . హీరోయిన్స్ కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అంతేనా ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు.. అంతే త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకొని ,,అభిమానులను సంతోషపెట్టే కబుర్లు చెప్తున్నారు. ఎంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్న అందరూ ఎదురుచూసే న్యూస్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆరుడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లి గురించి. కానీ ఆ ఒక్కటి అడగకు అంటూ ప్రభాస్ పెళ్లి విషయాని వెనక్కి వేసుకుంటూ వస్తున్నాడు.
అసలు పెళ్లి చేసుకుంటాడో లేదో కూడా డౌటే. కానీ చేసుకుంటే చూడాలని వాళ్ల అమ్మ గారితో పాటు సినీ సెలబ్రిటీస్.. ఆయనను ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ పక్కన పెడితే. ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ జాతి రత్నాలు సినిమాతో ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయిన నవీన్ పోలిశెట్టి మాత్రం పెళ్లి చేసుకోబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.
హీరోగా హిట్ కొట్టిన సినిమాలు చెప్పలేం కానీ తన నటనతో మాత్రం అభిమానులను కడుపుబ్బ నవ్వించాడు అని మాత్రం పక్కగా చెప్పొచ్చు. జాతి రత్నాలు సినిమాలో ఆయన నటన ..ఆయన పెర్ఫార్మన్స్.. ఆయన యాక్టింగ్ స్టైల్.. గురించి బడాబడా స్టార్స్ కూడా పొగిడేసిన సందర్భాలు ఉన్నాయి.
మరి ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన హోస్ట్ గా చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ మీద ఉన్న గౌరవంతో ప్రభాస్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఎంత హంగామా చేసారో మనం చూసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవీన్ పోలిశెట్టి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు తన సొంత మరదలినే. చిన్నప్పటి నుంచి తన మరదలే తన ప్రాణంగా బ్రతికిన నవీన్ పోలిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సరదాగా పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మన జిందగీ మొత్తం కరాబ్ అవుతుంది అని.. ఆట పట్టించే నవీన్ పోలిశెట్టి పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అవుతున్నాడు అని,, తెలియడంతో ఫాన్స్ సంతోషపడుతున్నారు. కానీ “ఏంటి మామ ఇంత షాక్ ఇచ్చావు.. పెళ్లి వద్దు అంటూనే నువ్వే పెళ్లి చేసుకుంటున్నావుగా..” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నవీన్ కూడా పెళ్లి చేసుకునేస్తున్నాడు..ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మరి మన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో..!?