Moviesతార‌క్ ఆ త‌ప్పు మ‌రోసారి చేయ‌వ‌ద్దు... బాధ‌తో ఫ్యాన్స్ రిక్వెస్టులు...!

తార‌క్ ఆ త‌ప్పు మ‌రోసారి చేయ‌వ‌ద్దు… బాధ‌తో ఫ్యాన్స్ రిక్వెస్టులు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ ఏడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా నేషనల్ లెవెల్ లో స్టార్ హీరో అయిపోయాడు. ఎంతోమంది స్టార్ హీరోలకు రాని ఇమేజ్ ఎన్టీఆర్‌కు త్రిపుల్ ఆర్‌ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వరుస‌పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు డబ్బులు హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్న తారక్ ఆ తర్వాత కేజీఎఫ్ – సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత నీల్‌తో తన 31వ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే ఆరు నెలలు కావస్తోంది. అప్పటినుంచి ఎన్టీఆర్ ఖాళీగానే ఉంటున్నాడు. ఓవైపు బుచ్చిబాబు సానా అలాంటి దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నా… ఎన్టీఆర్ మాత్రం తనకోసం క్యూలో ఉన్న దర్శకులను కాదని… కొరటాలతో సినిమా చేసేందుకే రెడీగా ఉన్నాడు. అయితే ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. దీనికి తోడు ఆచార్య సినిమా నష్టాలు భర్తీ చేసేందుకు కొరటాల నాలుగైదు నెలల టైం వేస్ట్ చేసేసాడు. ఇప్పుడు కథ కూడా ఎన్టీఆర్ అనుకున్నట్టుగా రాకపోవడంతో కొరటాల మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొరటాలను నమ్మి 6 నెలలు ఖాళీగా ఉండటం ఎన్టీఆర్ అభిమానులకు ఎంత మాత్రం నచ్చటం లేదు. పైగా ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాలతో సినిమా చేయటం ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు… సగటు సినీ అభిమానికి కూడా నచ్చటం లేదు. కొరటాల ఇప్పటికీ ఆచార్య ప్లాప్ నుంచి చేరుకోలేదు. ఇలాంటి సమయంలో కొరటాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ సినిమా చేయటం పెద్ద రిస్కే అంటున్నారు. అస‌లు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియ‌డం లేదు.

మ‌రోవైపు అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్ ఏకంగా మూడున్న‌రేళ్లు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ త‌ర్వాత త్రిబుల్ ఆర్‌లో చేసిన మ‌రో హీరో చ‌ర‌ణ్ చ‌క‌చ‌కా సినిమాలు చేస్తుంటే.. ఎన్టీఆర్ ఇంత ఖాళీగా ఉండ‌డం అభిమానుల‌ను కూడా తీవ్రంగా నిరాశ ప‌రుస్తోంది. మ‌రోవైపు ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియ‌క గెడ్డం పెంచుతూ ఉంటున్నాడు. తారక్ మ‌రోసారి ఇంత గ్యాప్ తీసుకోవ‌ద్ద‌ని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news