కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన నయనతార ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు వ్యక్తిగత కారణాల చేత ..మరికొన్ని సార్లు సినిమాల కారణంగా..మ్యాటర్ ఏదైన నయన్ ఖచ్చితంగా ట్రోల్ అవ్వాల్సిందే . అలాంటి పోజీషన్ లొ ఉంది నయనతార. సినిమాల పరంగా అమ్మడు సూపర్ గుడ్..ఎక్స్పొజింగ్ చేస్తూనే..నటన కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తుంది. ప్రజెంట్ సౌత్ లొ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఈమె. చాలా మంది హీరోయిన్స్ కి నయన్ నే ఇన్స్పిరేషన్.
ఈ మధ్య కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ బ్యూటి..ఇప్పుడు మళ్ళీ సినిమాలో బిజీ అవుతుంది. అట్లీ డైరెక్షన్ లొ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ఈమె కోలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. తెలుగులో ఆల్ రెడీ చిరంజీతో నటించిన సినిమా.. కూడా ఆల్ మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసింది . అయితే, ఇలా ఫుల్ బిజీగా ఉన్న నయన్ కు అత్త క్రేజీ కోరిక కోరిందట. విగ్నేశ్ మదర్…నయన్ ను ఓ కోరిక కొరిందంటూ కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి అత్త గారు ఆశపడ్డట్లే..విగ్నేశ్ మదర్ కూడా..నయన్ కు వారసుడో వారసురాలో ఇవ్వమని..అడుగుతుందట. అఫ్ కోర్స్ ఇది పెద్ద మ్యాటర్ కాదు. అందరి కోడల్లకు ఎదురైయ్యే విషయమే. కానీ నయన్ లాంటి బిగ్ హీరోయిన్ అందులో ఫుల్ ఆఫర్స్ చేతిలో పెట్టుకుని ఉన్న హీరోయిన్ ని ..ఆమె అడగటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె పదే పదే నయన్ దగ్గర ఇదే ప్రస్తావన తీసుకొస్తూ..పిల్లల విషయంలో ఫోర్స్ చేస్తుందట. ఇప్పుడు ఇదే విషయం కోలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.