Moviesరెండో ప్రియుడితో శృతిహాస‌న్ బ్రేక‌ప్‌కు ఇంత స్టోరీ ఉందా... రెండేళ్ల స‌హ‌జీవ‌నంలో...

రెండో ప్రియుడితో శృతిహాస‌న్ బ్రేక‌ప్‌కు ఇంత స్టోరీ ఉందా… రెండేళ్ల స‌హ‌జీవ‌నంలో ఏం జ‌రిగింది…!

క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతి హాస‌న్. వ‌రుస ఫ్లాప్ లు ప‌డ‌టంతో మొద‌ట ఈ భామ‌ను అంతా ఐర‌న్ లెగ్ అన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె చేసిన సినిమాలు అన్నీ ప్లాపులే. కానీ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో తాను గోల్డెన్ లెగ్ అని శృతి హాస‌న్ అంద‌రి నోర్లు మూయించింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది. గ‌బ్బ‌ర్ సింగ్ తర‌వ‌త శృతి తెలుగు, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ అయిపోయింది. దాదాపుగా టాలీవుడ్ కోలీవుడ్ లోని అంద‌రు స్టార్ హీరోల ప‌క్క‌న జోడీ క‌ట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

కానీ అక్క‌డ స‌క్సెస్ అవ్వ‌లేపోయింది. ఇక శృతిహాస‌న్ మిగితా హీరోయిన్ల‌ కంటే కాస్త స్పీడ్ అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభం నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ్ అఫైర్ ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. కెరీర్ ప్రారంభంలోనే శృతిహాస‌న్ ల‌వ‌ర్ బాయ్ హీరో సిద్దార్థ్ తో ప్రేమాయ‌ణం న‌డిపించింది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. సిద్దార్థ్ తో క‌లిసి శృతి రెండు సినిమాలు చేసింది. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని ఈ విష‌యంలో క‌మ‌ల్ హెచ్చ‌రించినా శృతి విన‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర‌వాత సిద్దార్థ్ తో కొన్నికార‌ణాల వ‌ల్ల విడిపోయింది.

ఆ త‌ర‌వాత శృతి పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండానే లండ‌న్ కు చెందిన థియేట‌ర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్స‌లే తో ప్రేమ‌లో ప‌డింది. అంతే కాకుండా ఈ జంట చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు. మైకేల్‌తో ప్రేమ‌లో మునిగి తేలినంత‌కాలం శృతి సినిమాల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. శృతి త‌న ప్రియుడితో క‌లిసి త‌ల్లి సారిక‌తో బ‌య‌ట క‌నిపించిన ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అంతే కాకుండా మైకేల్ ను శృతి హాస‌న్ ఓ త‌మిళ న‌టుడి పెళ్లికి కూడా తీసుకువ‌చ్చింది.

మైకేల్ తో పాటూ శృతిహాస‌న్ ఆ పెళ్లికి సాంప్ర‌దాయ దుస్తుల్లో రాగా అదే పెళ్లిలో శృతిహాస‌న్ త‌న బాయ్ ఫ్రెండ్ ను క‌మ‌ల్ హాస‌న్ కు ప‌రిచ‌యం చేసింది. ఆ త‌ర‌వాత శృతిహాస‌న్ మైకేల్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్త‌లు వినిపించాయి. కానీ తాము బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని అందరికీ ఈ జంట షాక్ ఇచ్చారు. శృతి సినిమాల‌ను వ‌దిలి లండ‌న్ వెళ్ల‌డం కుద‌ర‌క‌నే ఈ జంట విడిపోయిన‌ట్టు ఆప్ప‌ట్లో టాక్ వినిపించింది.

తాను ఇండియాలోనే ఉంటూ సినిమాలు చేస్తాన‌న్న కండీష‌న్ పెట్ట‌డం ప్రియుడికి న‌చ్చ‌లేద‌ట‌. ఆ త‌ర‌వాత శృతిహాస‌న్ కాళీగా కూర్చోలేదు. కొంత‌కాలానికే శాంతాను హ‌జారికా అనే ఆర్టిస్ట్ తో డేటింగ్ మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం మూడో బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. మ‌రి ఈ జంట అయినా పెళ్లి పీట‌లు ఎక్కుతుందా ? లేదా చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news