నందమూరి నటసింహ బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పౌరాణికం- సాంఘికం – జానపదం – చారిత్రకం – సైన్స్ ఫిక్షన్ – ఫ్యాక్షనిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. ఆదిత్య 369 – గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడం కూడా బాలయ్యకే చెల్లింది. బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య 369 సినిమా ఒకటి. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు.
ఆ రోజుల్లో ప్రయోగాత్మక సినిమాలు చేయటం అంటే పెద్ద రిస్క్ తో కూడుకున్నది. అలాంటి సమయంలో బాలయ్య టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించి చాలా డేరింగ్ స్టెప్ వేశారు. సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్లో 369 అనే నెంబర్ ఎందుకు ? ఉందో ఎవరికి అర్థం కాలేదు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ 369 నెంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు.
దీంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని సమాధానం ఇచ్చారు. ఇక 369 నెంబర్ గురించి చెబుతూ అదో స్పెషల్ నెంబర్ అని చెప్పారు. అయితే ఆ నెంబర్ ఎలా ? వచ్చింది దాని అర్థం ఏంటన్నది ? మాత్రం బాలయ్య చెప్పలేదు. అయితే 369 అనే నంబర్ వెనక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటి అన్న మీనింగ్ ఉంది. ఇందులో 3 అంటే మార్పు… 6 అంటే కొత్త ఆరంభం అని ఆర్థం.
ఇక 9 అంటే విస్తరించడం అన్న అర్థం వస్తుందట. ఇక గడియారంలో కూడా 369 అనే నెంబర్ సరి సమానమైన కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం కూడా ఇది చాలా లక్కీ నెంబర్ అంటారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు సైతం ఇది లక్కీ నెంబర్. సల్మాన్ కార్ నెంబర్లు ఎక్కువుగా 369తోనే ఉంటాయి. సల్మాన్ ముహూర్తాలు, సెంటిమెంట్లు కూడా ఈ నెంబర్‌తోనే ఎక్కువుగా ముడిపడి ఉంటాయట.
ఇక 369లో 3+ 6 =9 వస్తుంది. ఈ 9 అనేది చాలా మంది సెలబ్రిటీలకు కూడా లక్కీ నెంబరే. జూనియర్ ఎన్టీఆర్‌కు 9 లక్కీ నెంబర్. ఎన్టీఆర్ ఫోన్ నెంబర్లలో 9 ఉంటుంది. ఎన్టీఆర్ కార్ నెంబర్లలో కూడా 9 ఉంటుంది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా 9 ఎంతో లక్కీ నెంబరో తెలిసిందే.